ఏకాంతంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం..


Ens Balu
2
Simhachalam
2021-05-14 09:10:18

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహా లక్ష్మీ నృసింహ స్వామి(సింహాద్రి అప్పన్న) చందనోత్సవం వరుసగా రెండో ఏడాది ఏకాంతంగానే జరిగింది. శుక్రవారం స్వామివారి నుంచి చందనం ఒలుపులు తరువాత ఆలయ ధర్మకర్త సంచయిత గజపతి రాజు తొలి దర్శనం చేసుకున్నారు. అనంతరం ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కుటుంబ రెండో దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సంచయిత మాట్లాడుతూ, స్వామివారి నిజరూప దర్శనం సర్వపాప హరమని, తమ పెద్దలు తరువాత స్వామివారిని తొలి దర్శనం చేసుకునే అవకాశం తనకు దక్కడం ఆనందంగా ఉందన్నారు. మంత్రి ముత్తం శెట్టి మాట్లాడుతూ, సింహాద్రి అప్పన్నకు కుటుం సమేతంగా పట్టువస్త్రాలు సమర్పించే అవకాశం దక్కడం పూర్వజన్మ సుక్రుతంగా భావిస్తున్నానని అన్నారు. ఆ స్వామి ఉగ్రరూపం కరోనాను జయించే శక్తి ఇవ్వాలని, కోవిడ్ రోగులు సత్వరమే కోలుకోవాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామిని కోరుకున్నట్టు చెప్పారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి తొలి విడత చందనం సమర్పించారు.

సిఫార్సు