16నుంచి సింహాద్రి అప్పన్న దర్శనాలు..
Ens Balu
2
Simhachalam
2021-05-14 11:19:29
విశాఖలోని సింహాచలం శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామి(సింహాద్రి అప్పన్న) దేవస్థానంలో దర్శనాలను తిరిగి ప్రారంభిస్తున్నట్టు అనువంశిక ధర్మకర్త గజపతిరాజు సంచయిత, ఈఓ ఎంవీసూర్యకళ తెలియజేశారు. శుక్రవారం ఈ మేరకు వీరు మీడియాతో మాట్లాడారు. స్వామి చందనోత్సవం వెళ్లిన రెండు రోజుల తరువాత అంటే ఈనెల 16వ తేది నుంచి ప్రతీ రోజు రెండు గంటల పాటు స్వామి దర్శనాలు కల్పించనున్నట్టు వివరించారు. ఉదయం 7.30 నుంచి 9.30 వరకూ మాత్రమే దర్శనాలు ఉంటాయన్నారు. భక్తులందరూ ప్రభుత్వం నిర్ధేశించిన కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ స్వామివారిని దర్శించుకోవాలన్నారు. భక్తుల సౌకర్యార్ధం ఆలయాన్ని సోడియం హైపోక్లోరైడ్ తో ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తున్నట్టు వివరించారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాలేనివారు స్వామి ఈహుండీ ద్వారా, యుపీఐ ఐడీ ద్వారా మొక్కులు చెల్లించుకోవచ్చునన్నారు.