ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆద్వర్యంలో విశాఖటపట్నంలో అత్యాధునిక హంగులతో ఏర్పాటు చేసిన 300 పడకల పూర్తి ఆక్షిజన్ సదుపాయం కలిగిన కోవిడ్ కేర్ సెంటర్ రాష్ట్రంలోని కోవిడ్ కేర్ సెంటర్లుకు ఆదర్శమని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని) అన్నారు. విశాఖపట్నం షీలానగర్ లో వికాస్ కాలేజీలో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్ ను రాజ్యసభ సబ్యులు వి విజయసాయి రెడ్డి, మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్ లతో కలిసి ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రగతి భారత్ ట్రస్టు ఏర్పటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్ అత్యాధునిక సదుపాయాలు గల కోవిడ్ ఆసుపత్రిని తపలించేవిధంగా ఉందని అన్నారు. అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దిన ఈ కోవిడ్ కేర్ సెంటర్ లోని మల్టీ టైర్ ఆక్షిజన్(నాలుగు అంచెల) సరఫరా విధానం పేషెంటు కు ఆక్షిజన్ అందించడంలో పూర్తి భద్రత కల్పిస్తుందని, ఎటువంటి పరిస్థితిలు ఎదురైన అంతరాయం కలగడానికి ఆస్కారం లేదని అన్నారు. రాష్ట్రంలోని అన్ని కోవిడ్ ఆసుపత్రులు ఈ విధానాన్ని పాటిస్తే ఇటీవల జరిగిన కొన్ని బాదాకర సంఘటనలు కూడా జరిగి ఉండేవి కావని అన్నారు. గతంలో కోవిడ్ బారిని పడిన వారు పెద్దగా ఆక్షిజన్ అవసరం లేకుండా కోలుకుననే వారని ,ప్రస్తుతం విస్తురిస్తున్న కోవిడ్ వ్యాది ప్రజల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నదని అన్నారు. గతంలో కేవలం 40 మెట్రిక్ టన్నుల ఆక్షిజన్ మాత్రమే కోవిడ్ ఆసుపత్రులను అవసరమయ్యిందని అయితే ప్రస్థుతం సెకెండ్ వేవ్ లో 600 మెట్రిక్ టన్నులు ఆక్షిజన్ కూడా సరిపోవడం లేదని అన్నారు. కోవిడ్ వ్యాది ఉదృతంగా విస్తరిస్తునన్న నేపద్యంలో ఆసుపత్రులలో బెడ్స్ కొరత ఏర్పడిందని ఈ మేరకు ఇటువంటి కోవిడ్ కేర్ సెంటర్ల సేవలు ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.
ఆంద్రా మెడికల్ కాలేజీ సహకారంలో ఈ కోవిడ్ కేర్ సెంటర్లో స్పెషలిస్టు డాక్టర్ల సేవలు అందుబాటులో ఉంటాయని అన్నారు. ప్రగతి బారత్ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసినప్పటికీ దీని నిర్వహణ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రభుత్వనికే అందజేయాలన్న నిర్ణయం అభినందనీయమని దీనికి,సంబందించి తనవంతు సహకారం అందిస్తానని అన్నారు. దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కోవిడ్ నియంత్రణలో ఆంద్రప్రదేశ్ ఎంతో మెరుగ్గా ఉందని అన్నారు. అంతకు ముందు రాజ్యసభ సభ్యులు, ప్రగతిభారత్ మేనేజింగ్ ట్రస్టీ విజయసాయి రెడ్డి మాట్టడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా అత్యాధునిక హంగులతో, పూర్తి సాంకేతికతతో ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆద్వర్యంలో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేసామని అన్నారు. ఆక్షిజన్ అందక ఏ ఒక్క కోవిడ్ బాదితుడూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశ్యంలో విశాఖ ప్రజల అవసరాలు దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేసామని అన్నారు. ఇటీవల కేజిహెచ్, మరియు విమ్స్ ఆసుపత్రులలోని కోవిడ్ వార్డులు సందర్శించడంతో పాటు, వైరాలజీ ల్యాబ్, 104 కాల్ సెంటర్ లను పరిశీలించిన అనంతరం కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్నామని అన్నారు. మల్టీ టైర్ ఆక్షిజన్ సరఫరా సిస్టం ద్వారా పేషెంటుకు ఆక్షిజన్ సరఫరాలో ఎట్టిపరిస్థితిలోనూ అంతరాయం కలగదని అన్నారు. మల్టీ టైర్ ఆక్షిజన్ సరఫరా విధానిన్ని వివరిస్తూ ఒక్కొక్కటి 3750 క్యూబిక్ మీటర్లు సామర్ద్యం గల రెండు అతిపెద్ద ఆక్షిజన్ ట్యాంకులు ఏర్పాటు చేశామన్నారు. ఈ ఆక్షిజన్ ను పైపులైన్లు ద్వారా పేషెంటుకు నేరుగా అందిస్తామని అన్నారు.
ట్యాంకుల ద్వారా సరఫరాకు అంతరాయం ఏర్పడినట్లైతే ఒక్కోక్కటి 60 లీటర్లు సామర్ద్యం కలిగిన 200 సిలండర్లు ప్రత్యామ్నాయంగా మెత్తం 2000 క్యూబిక్ మీటర్లు సామర్ద్యంతో ఏర్పాటు చేయడం జరిగిందని వాటి ద్వారా పైపులైన్లకు సరఫరాను వెంటనే పునరుద్దరిస్తారని అన్నారు. దానికి కూడా అంతరాయం ఏర్పాడితే ఒక్కో పేషెంటు బెడ్డు వద్ద 47 లీటర్లు కెపాసిటి కల్గిన సిలండర్ మెత్తం 1500 క్యూబిక్ మీటర్లు సామర్ద్యంతో అందుబాటులో ఉండచం జరిగిందని అన్నారు. మరో ప్రత్యామ్నాయంగా అమెరికా నుండి తెప్పించిన 250 ఆక్షిజన్ కాన్సెంట్రేటర్లు అందుబాటు ఉంచడం జరిగిందని అన్నారు. ఈవిధంగా మల్టీ టైర్ విధానాన్ని అవలంబిస్తూ ఆక్షిజన్ సరఫరా చేస్తామని అన్నారు. ఆక్షిజన్ సాచురేషన్ 90 కంటే ఎక్కువగా ఉన్నవారికే ఇక్కడ అడ్మిషన్ చేసుకుంటామని 90 కంటే తక్కువ ఉన్నవారిని వెంటిలేటర్లు, ఐసియు అవసరం ఉంటుందని అన్నారు. అయిటే అటువంటి రోగులకు కేజిహెచ్ మరియు విమ్స్ ఆసుపత్రులకు తరించేందుకు అంబులెన్సులు కూడా అందుబాటు ఉంచామని అన్నారు. పేషెంటు ఆడ్మిషన్ కోసం వచ్చినపుడు రిషెప్సన్ వద్దనే ఆక్షిజన్ కాన్సెంట్రేటర్లు సహాయంతో ఆక్షిజన్ అందించి తదుపరి పరీక్షలు, టెస్టులు చేస్తామని అన్నారు. పేషెంటు వివరాలు, బెడ్డు వివరాలు రిసెప్సన్ వద్ద డిస్ ప్లే బోర్డు ఏర్పాటు చేసామని అన్నారు. పేషెంటు కుటుంబ సబ్యులు రిసెప్సన్ వద్ద ఏర్పాటు చేసిన సిసి కెమేరా ద్వారా లోపల చికిత్స పొందుతున్న తమ వారాకి చూడవచ్చని అన్నారు. ప్రబుత్వం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహాకారంతో పేషెంటుకు అన్ని రకాల మందుకు ఉచితంగా అందిస్తామని అన్నారు.
ఆర్ టి పిసి ఆర్, ర్యాపిడ్, హెచ్, సి జి మెదలగు టెస్టు చేస్తామని అన్నారు. పేషెంట్లకు, డాక్టర్లు, నర్సులకు, ఇతర సిబ్బందికి పౌష్టికాహారం ప్రతిరోజు అందిస్తామని అన్నారు. మెదటి అంతస్థుకు చేరుకోడానికి లిఫ్టు సదుపాయం కల్పించనున్నామని అన్నారు. ఒక్కో ఫ్లోర్ కి 20, బాత్ రూంలు, 20 టాయిలట్లు ఏర్పాటు చేయడం జరిగిందిని అన్నారు. విద్యుత్ అంతరాయం ఎర్పాడితే 2 అటో స్టాట్ జనరేటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కేంద్రంలో 30 మంది డాక్టర్లు, 60 మంది నర్సులు మరయు 8 మంది టెక్నిషియన్లు వైద్య ఆరోగ్య శాఖా మంత్రి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఆంద్రా మెడికల్ కాలేజీ యాజమాన్యం ఈ కోవిడ్ కేర్ సెంటర్ కు కేటాయించడం జరిగిందని అన్నారు. ఈ మేరకు వారికి కృతజ్ఞత తెలియజేసారు. 30 లమంది సానిటేషన్ వర్కర్లు పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతరమూ పనిచేస్తారని తెలిపారు. 20 అగ్నిమాపక పరికరాలు అందుబాటు ఉంచామని వెల్లడించారు. ఈ కోవిడ్ కేర్ సెంటర్ ను ప్రభుత్వం గుర్తింపు పొందిన కోవిడ్ కేర్ సెంటర్ గా గుర్తించాలని ఆరోగ్య శాఖా మంత్రిని కోరారు. రెమిడిస్ వేర్ మందు ప్రభుత్వం దగ్గర నుండి కొనుగోలు చేసి అవసరమైన ప్రతి పేషెంటుకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ప్రగతి భారత్ ఫౌండేషన్ తరుపున 30 మంది అడ్మినిష్ట్రేటివ్ స్టాఫ్ పనిచేస్తారని అన్నారు.
ఈ మేరకు ట్రస్టు సభ్యులు గోపినాధ్ రెడ్డి, ఉమేష్, రమణ మరియు బాలాజీల కృషిని కొనియాడారు. విశాఖజిల్లా ఇన్చార్జి మంత్రి మరియు వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ విపత్కర పరిస్థితులలో ప్రజలను ఆదుకోవడానికి ముందుకు వచ్చిన ప్రగతి భారత్ షౌండేషన్ సహసోపేత నిర్ణయాన్ని ఆయన కొనియాడారు. గతంలో కోవిడ్ సంక్షోబ సమయంలో సుమారు 70 వేల కుటుంబాలకు ట్రస్టు ద్వారా నిత్యవసర వస్తువులు అందజేసిన విషయాన్ని ఈ సందర్బంగా గుర్తు చేసారు. పర్యాటన శాఖా మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ విశాఖ జిల్లా ప్రజలకు నేనున్నాననే భరోసా రాజ్యసభ సబ్యులు విజయాసాయి రెడ్డి కల్పిస్తున్నారని విపత్కర సమయంలోనూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని కొనియాడారు. కార్యక్రమంలో విశాఖ మేయర్ హరి వెంకట కుమారి, ప్రభుత్వ విప్ బూడి ముత్యాల నాయుడు, ఎమ్మేల్యేలు గుడివాడ అమర్నాథ్, కరనం ధర్మశ్రీ, పెట్ల ఉమ శంకర్ గణేష్, చెట్టి పాల్గున, భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీధర్, నగర అధ్యక్షులు వంశీ కృష్ణ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు మళ్ళ విజయ ప్రసాద్, రెహమాన్, చింతలపూడి వెంకట్రామయ్య, ప్రగతి భారతి ట్రస్టు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.