ఆన్ లైన్ లో సింహాద్రినాధుని అర్చనలు..
Ens Balu
5
Simhachalam
2021-05-14 13:45:56
విశాఖలోని సింహాచలం శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామి(సింహాద్రి అప్పన్న) దేవస్థానంలో ఈనెల 16 నుంచి ఆన్ లైన్లోనే అర్చనలు, పూజలు చేపడుతున్నట్టు ఈఓ ఎంవీసూర్యకళ తెలియజేశారు. శుక్రవారం సింహాచలంలో ఆమె మీడియాతో మాట్లాడారు. కరోనా నేపథ్యంలో భక్తుల సౌకర్యార్ధం స్వామివారికి ఆన్ లైన్ లో నే అర్చనలు, చేసి వాటి యొక్క వీడియోలను భక్తులకు తెలియజేస్తామని చెప్పారు. దానికోసం ప్రత్యేకంగా యూట్యూబు ఛానల్ ను ఏర్పాటు చేశామని, వాటి ద్వారా స్వామివారి అర్చనలు ఆన్ లైన్ లోనే తిలకించవచ్చునని ఈఓ చెప్పారు. నిత్య కల్యాణం ( ప్రతి రోజూ ఉదయం 9:30 నుంచి 10:30), గురు- ఆదివారాల్లో జరిగే స్వర్ణపుష్పార్చన (8గంటలకు ఉదయం) , ప్రతినెలా స్వాతి నక్షత్రం రోజు స్వాతి హోమం (ఉదయం 8 గంటలకు),ప్రతి ఏకాదశి రోజు స్వర్ణతులసీదళార్చన ఆన్ లైన్లో వీక్షించవచ్చునని ఈఓ చెప్పారు. నిత్యకళ్యాణానికి 1,000(వెయ్యి రూపాయలు), స్వర్ణపుష్పార్చనకు రూ. 2,116 (రెండు వేల నూట పదహారు రూపాయలు), స్వాతి హోమానికి రూ.2,500 (రెండువేల ఐదు వందలు), స్వర్ణతులసీదళార్చనకు రూ.2,116( రెండువేల నూటపదహారు) చెల్లించాల్సి ఉంటుందన్నారు. మీ తరపున స్వామివారి కళ్యాణమండపంలో గోత్రనామాలతో పూజలు, అర్చనలు వేద పండితులు నిర్వహిస్తారన్నారు. ఆన్ లైన్ పూజలు, అర్చనల్లో భాగస్వాములు కావాలనుకునే భక్తులు దేవస్థానం అకౌంట్ UPI ID:9491000635@SBI కుగానీ, ఆన్ లైన్లో SBI అకౌంట్ నంబర్ EO,SVLNS devasthanam 11257208642, IFCS code SBIN 0002795కు గాని, కనీసం ఒక రోజు ముందుగా నిర్ణీత రుసుము చెల్లించి పూజలు చేయించుకోవచ్చునన్నారు. ఆన్ లైన్ లో డబ్బులు పంపాక తప్పకుండా దాని స్క్రీన్ షాట్ ఫొటో తీసి , మీ పేరు, గోత్రం తదితర వివరాలు 6303800736 నంబర్ కు వాట్సప్, మెసేజ్ ద్వారా పంపించాల్సి వుంటుందన్నారు. భక్తుల సందేహాలను కూడా ఇదే నెంబరు ద్వారా నివ్రుత్తి చేసుకోవచ్చునన్నారు.