రేపు కోవ్యాక్సిన్ రెండవ డోసు మాత్రమే..


Ens Balu
2
Srikakulam
2021-05-14 14:06:25

శ్రీకాకుళం జిల్లాలో శనివారం కోవాక్సిన్ టీకా ఇవ్వనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె.సి.చంద్ర నాయక్ మరియు జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ కే.అప్పారావు సంయుక్తంగా తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ కో వ్యాక్సిన్ రెండవ డోసుకు అర్హులైన వారికి మాత్రమే శనివారం రెండవ డోసు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అర్హులైన హెల్త్ వర్కర్లు,  ఫ్రంట్ లైన్ వర్కర్లు, 45 సంవత్సరాల వయసు పైబడిన సాధారణ ప్రజానీకం ఈ టీకాను తీసుకోవచ్చని వారు కోరారు. టీకాను శ్రీకాకుళం, ఆముదాలవలస, పాతర్ల పల్లి,  పొగిరి, పొన్నాడ, పొలాకి పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో పాఠశాలలు, కళాశాలల్లో టీకా ఇవ్వడం జరుగుతుందని వారు వివరించారు. రోజుకు వంద మందికి మాత్రమే ఇవ్వడం జరుగుతుందని, ఆ వంద మందికి ముందుగా సమాచారం అందజేయడం జరుగుతుందని వారు తెలిపారు. కోవిషీల్డు వ్యాక్సిన్ అందుబాటులో లేదనే విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు.

సిఫార్సు