మత్స్యకార భరోసా రూ.2.95 కోట్లు..


Ens Balu
2
Vizianagaram
2021-05-15 09:10:40

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యకార భరోసా కింద విజయనగరం జిల్లాలోని మత్స్యకారులకు రెండుకోట్ల, 95లక్షల 30వేల రూపాయలు అందించనుందని మత్స్యశాఖ ఉప సంచాలకులు ఎన్.నిర్మలకుమారి తెలియజేశారు. శనివారం ఈ మేరకు మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని సముద్రతీర మండలాలైన బోగాపురం, పూసపాటిరేగ ప్రాంతాల్లో 819 బోట్లలో పనిచేసే 2953 మంది లబ్దిదారులకు మత్స్యకార బ్రుతి క్రింద ఒక్కొక్కరికీ రూ.10వేలు చొప్పున ఖాతాల్లోకి జమ అవుతుందన్నారు. ఈనెల 18వ తేదిన అమరావతిలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆన్ లైన్ లో లబ్దిదారాల ఖాతాలోకి నేరుగా నగదు జమ అయ్యేలా ఈ కార్యక్రమాన్ని మీట నొక్కి ప్రారంభిస్తారన్నారు. ఈ మేరకు జిల్లాలోని లబ్దిదారుల జాబితా మొత్తం ఆన్ లైన్ చేసినట్టు డిడి నిర్మల కుమారి వివరించారు. 

సిఫార్సు