50 ఆక్సిజన్ కాన్సన్ ట్రేట్ లు వితరణ..
Ens Balu
2
King George Hospital
2021-05-15 09:32:36
విశాఖ జిల్లాలో ఆక్సిజన్ కొరతను నివారించడానికి సురక్ష స్వచ్ఛంద సంస్థ 50 ఆక్సిజన్ కాన్ సన్ ట్రేటర్ లను కె జి హెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మైథిలి కి విరాళంగా అందజేశారు. చైనాలో తయారైన రూ. 25 లక్షల విలువైన 50 ఆక్సిజన్ కాన్ సన్ ట్రేటర్ లను సురక్ష సంస్థ కార్యదర్శి నిర్మలా నందా శనివారం నాడు విశాఖపట్నం ఆర్డీవో పెంచల కిషోర్ సమక్షంలో కె జి హెచ్ కు అందజేశారు. జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ తో సురక్ష సంస్థ అధ్యక్షుడు రాజ్ గొర్ల ఇంతకు ముందు మాట్లాడి, ఆక్సిజన్ కాన్ సన్ ట్రేటర్ లను అందజేస్తామని తెలియజేశారని, ఆ ప్రకారమే ఇప్పుడు అందజేస్తున్నామని కార్యదర్శి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.