విశాఖలోని సింహాలచంలోని శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి(సింహాద్రి అప్పన్న)కు వెండి కలసం మొక్కురూపంలో అందింది. విశాఖకు చెందిన ఫణిసోమరాజు, అంజనీదేవి దంపతులు ఆదివారం రూ.75వేలు విలువ చేసే 29 గ్రాముల వెండి కలశాన్ని స్వామివారికి సమర్పించారు. దానిని ఆలయ ఏఈఓ రాఘవకుమార్ కి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, స్వామి క్రుపతో తమ పిల్లల మొక్కు నెరవేరిందని, స్వామికి మొక్కుకున్నట్టుగా వెండి కలశాన్ని సమర్పించి తమ మొక్కు తీర్చుకున్నట్టు చెప్పారు. ఏఈఓ మాట్లాడుతూ భక్తులు ఎవరు మొక్కులు నగదు లేదా వస్తురూపంలో సమర్పించినా రసీదు పొందాలన్నారు. ప్రభుత్వం నిర్ధేశించి నిబంధనల ప్రకారమే స్వామివారిని దర్శించుకోవాలని సూచించారు.