విశాఖలోని సింహాలచంలోని శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి(సింహాద్రి అప్పన్న)కు ప్రభుత్వ సలహాదారు టి.వెంకటలక్ష్మీనరసింహమూర్తి రూ.3.10 లక్షల విలువైన పెండాల్స్ విరాళంగా సమర్పించారు. ఆదివారం స్వామివారి దేవస్థానంలో వీటిని ఆయన తరపున సింహాద్రి మఠం వ్యవస్థాపకులు కె. సురేంద్రస్వామి ఏఈఓ రాఘవకుమార్ కి అందజేసి రసీదు పొందారు. ఈ పెండాల్స్ ను పెడిమాంబ లైటింగ్ అండ్ సౌండ్స్ అధినేత భాస్కరరావు ఎలాంటి రుసుము తీసుకోకుండా స్వామివారికి కానుకగా వాటిని తయారు చేశారు. వేసవిలో భక్తులు సేదతీరడానికి ఈ పెండాల్స్ ఎంతగానో ఉపయోగపడతాయని దేవస్థాన అధికారులు చెబుతున్నారు. అనంతరం దాతలకు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.