ప్రారంభమైన సింహాద్రి అప్పన్న దర్శనాలు..


Ens Balu
1
Simhachalam
2021-05-16 08:33:29

విశాఖలోని సింహాలచంలోని శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి(సింహాద్రి అప్పన్న) దర్శనాలు ఆదివారం నుంచి తిరిగి ప్రారంభం అయ్యాయి. కరోనా, చందనోత్సవం నేపథ్యంలో 15వ తేదీ వరకూ భక్తులకు దర్శనాలు నిలుపుదల చేసిన దేవస్థానం అధికారులు తిరిగి ఆదివారం దర్శనాలు ప్రారంభించడంతో  ఉదయం 7.30 నుంచి 9.30 వరకూ భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. అయితే కేవలం స్వామివారి దర్శనాలు రెండు గంటల పాటు మాత్రమే భక్తులకు అవకాశం కల్పించి ఇతర సేవలన్నీ ఏకాంతంగానే నిర్వహిస్తున్నారు. ఆదివారం దర్శనాలు ప్రారంభం అయ్యే సమయంలోనే వర్షం పడటం స్వామివారి మహిమ గా భక్తులు వర్ణించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శన ఏర్పాట్లు చేశారు దేవస్థానం అధికారులు. స్వామివారి ఆర్జిత సేవలన్నీ ఆన్ లైన్ ద్వారా వీక్షించాలని అధికారులు సూచిస్తున్నారు.

సిఫార్సు