కరోనా విలయతాండవం చేస్తున్నవేళ రోగులకు ఒకపూట భోజనం పెట్టాలనుకున్న ఆ అన్నదాత ఆలోచనకు మరో నలుగురు యువకులు తోడయ్యారు.. అనుకున్నదే తడవుగా చేయి చేయి కలిపి 300 మందికి ఆకలి తీర్చారు.. ఈ అరుదైన అన్నదాన కార్యక్రమానికి ఆదివారం కాకినాడ జనరల్ హాస్పిటల్ వేదికైతే.. ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ యాప్ ప్రధాన సాక్షిగా నిలిచింది.. కరోనాతో బాధపడుతున్న రోగులకు, వారికి సహాయం ఉండటానికి వచ్చిన వారికి, రోగులకు వైద్యసేవ చేసే ఆసుపత్రి సిబ్బందికి ఆహార పొట్లాలు అందించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు ఆ యువకులు. ఎక్కువ మందికి అన్నదానం చేద్దామనుకున్న శంఖవరం గ్రామసచివాలయం-1లో సర్వేయర్ గా విధులు నిర్వహిస్తున్న వీర్ల సురేష్ కి మరో దాత శ్రీనివాస్ తోడయ్యారు. ఆదివారం ఆసుపత్రిలో అన్నదానం చేద్దామని శుక్రవారమే ప్లాన్ చేసుకున్నారు. దానికోసం భోజనాలు స్వయంగా చేయిద్దామని భావించి సతీష్ అనే వంటలు వండే వ్యక్తిని సంప్రదిస్తే.. మీరు నిరుపేదలకు ఆకలి తీర్చే మంచి కార్యక్రమం చేస్తున్నారు.. విపత్కర సమయంలో మీరు చేసే మంచిపనిలో నన్నూ భాగస్వామిని కానీయండంటూ ఆహారాన్ని మొత్తం ఉచితంగానే తయారు చేసి అందించాడాయన.. ఇపుడు వండిన ఆహారాన్ని ఆసుపత్రికి తరలించాలి.. ఆటో కోసం చూస్తున్న సమయంలో డ్రైవర్ వెంకట అప్పలనాయుడు తారస పడ్డాడు.. ఇన్ని అన్నం పొట్లాలు ఎక్కడ దించాలని అని ప్రశ్నించాడు ఆటో డ్రైవర్.. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో పేద రోగులకు అన్నదానం చేస్తున్నాం టైమవుతుంది త్వరగా వెళ్లాలి అని చెప్పారు.. అంత మంది ఆకలి తీరుస్తున్నారు.. నేనూ మీ సేవకు తోడవుతాను నాకు ఎలాంటి డబ్బులు ఇవ్వొద్దు, నేనూ కూడా మీతో పాటే అందరికీ అన్నం పంచుతాను నాకూ ఓ అవకాశం ఇవ్వండి అని అడిగాడు.. చక్కగా ప్యాకింగ్ చేసిన ఆహార పొట్లాలు మొత్తం నా ఆటోలో వేసేయండి నేనే తీసుకు వస్తానంటూ వండిన అన్నం ప్యాకెట్లు మొత్తం ఆసుపత్రికి హుటా హుటీన తరలించేశారు.. తీరా అక్కడ అన్నం అందరికీ పంచాలి.. ఆసుపత్రి సిబ్బంది అంతా విధుల్లో ఉన్నారు..కోవిడ్ కావడంతో ఎవరూ అందుబాటులో ఎవరూ లేరు.. సహాయం కోసం వెతుకున్న సమయంలో రాబిన్ హుడ్ ఆర్మీ బ్రుందం సభ్యులు వి.రామ్, ఎ.లలిత్ సాయిలు వీరికి తోడయ్యారు.. అంతే చక చకా ఆసుపత్రిలో రోగులతోపాటు, సిబ్బందికి కడుపునిండా అన్నం పెట్టి దాహం తీర్చారు.. ఈ సమయంలో ప్రభుత్వం సూచించిన కరోనా నిబంధనలు(మొహానికి మాస్కులు, చేతికి హేండ్ గ్లౌజులు, చూట్టూ శానిటషన్ మధ్య మధ్యలో శానిటైజర్ తోశుభ్రం) పాటించారు ఆ యువకులంతా.. అక్కడ ఆహార పొట్లాలు తీసుకున్న ప్రతీ ఒక్కరూ ఆ ఐదురుగురు యువకుల వైపు చూస్తూ మీరంతా చల్లగా ఉండాలి బాబు, కష్టకాలంలో కడుపునిండా అన్నం పెట్టారంటూ నిండైన హ్రుదయంతో దీవించారు. దానికి ఆ యువకులు బదులిస్తూ.. సీఎం వైఎస్. జగన్మోహనరెడ్డి అలుపెరగ కుండా ప్రజలను ఈ కరోనా వైరస్ నుంచి కాపాడటానికి ఎంతో శ్రమిస్తున్నారు.. వైద్యం అందిస్తున్నారు, అన్నం పెడుతున్నారు, వైద్యసిబ్బందితో సేవలు చేస్తున్నారు, అంతలా ఆయన శ్రమిస్తున్న తీరు మాలో స్పూర్తి నింపి ఈ అన్నదాన కార్యక్రమానికి ప్రేరేపించింది అంటూ వారికి బదులిచ్చారు యువకులు.. ఐదుగురు యువకులు ఆసుపత్రిలో రోగుల కడుపు నింపడం కోసం చేసిన అన్నదాన కార్యక్రమం విజయవంతం అయ్యింది.. ఈ అన్నదాన కార్యక్రమం, యువకులు సేవతో ముందుకి వచ్చిన తీరు అక్కడి అధికారులను, వెద్య సిబ్బంది, కరోనా రోగుల సహాయకులను ఎంతగానో ఆలోచింపజేసింది. ఇంతటి మంచి కార్యక్రమాన్ని బాహ్య ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారిక మొబైల్ న్యూస్ ఈఎన్ఎస్ లైవ్, www.enslive.net పాఠకుల ముందుకి తీసుకు వచ్చింది. ప్రార్ధించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అనే మంచిని పాటించిన ఈ యువ అన్నదాతల స్పూర్తితో మరింత మంది ఈ కరోనా సమయంలో ముందికి వచ్చి సాయమందిలన్నదే ప్రధాన ఉద్దేశ్యం..జైహింద్..!