ఆక్సిజన్ నిల్వలపై అపోహలు అవసరం లేదని పటిష్ట కార్యాచరణ తో ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని జాయింట్ కలెక్టర్ హెల్త్ వీరబ్రహ్మం పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆయన ఆర్ డి ఓ కనక నరసారెడ్డి తో కలిసి రీఫిలింగ్ కేంద్రాల యజమానులతో ప్రైవేట్ ఆస్పత్రుల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు ప్రస్తుతం సరఫరా అవుతున్న ఆక్సిజన్ క్వాంటిటీ పై దృష్టి సారించాలన్నారు. జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేట్ ఆస్పత్రుల లో అందుబాటులో ఉన్న ఆక్సిజన్ బెడ్ లకు అనుగుణంగా ప్రాణవాయువును సరఫరా చేసేందుకు కు చర్యలు తీసుకోవాలన్నారు. కోవిడ్ ఆస్పత్రులను రీఫిల్లింగ్ కేంద్రాలకు అనుసంధానం చేసి ఆస్పత్రులకు తగినంత ప్రాణవాయువు నిరంతరాయంగా అందించాలని సూచించారు. ఆక్సిజన్ నిల్వలు , వినియోగం, వృధా పై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. ఆక్సిజన్ మేనేజ్మెంట్ పై నిర్దిష్ట ప్రణాళిక తయారు చేసి మంగళవారం ఉదయం లోపు కలెక్టర్ కు నివేదిక సమర్పించారు. ప్రస్తుతం అవసరానికి సరిపడా ఆక్సిజన్ అందుబాటులో ఉందన్నారు. జిల్లాలో అన్ని కోవేట్ కేర్ సెంటర్ లలోనూ ఆస్పత్రిలోనూ 18 టన్నుల ఆక్సిజన్ అవసరం ఉందన్నారు. జిల్లాకు ప్రతిరోజు 23 టన్నుల ఆక్సిజన్ ను ఇతర ప్రాంతాల నుంచి సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఆక్సిజన్ పై అనవసర అపోహలు వద్దని ప్రజలు ఈ విషయంపై భయపడాల్సిన పని లేదన్నారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఆరోగ్యశ్రీ కో-ఆర్డినేటర్ బాల ఆంజనేయులు , డ్రగ్ ఇన్స్పెక్టర్ కీర్తన ,జిల్లాలోని కోవిడ్ ఆసుపత్రుల ప్రతినిధులు , రీఫిలింగ్ కేంద్రాల యజమానులు పాల్గొన్నారు.