ఉత్తరాంధ్ర సంజీవినిగా పిలవబడుతున్న షీలానగర్ కోవిడ్ కేర్ సెంటర్ ద్వారా కోవిడ్ భాదితులకు భరోసా లభిస్తుంది. అత్యాధునిక హంగులతో, అత్యున్నత ప్రమాణాలతో ఎం.పి విజయసాయి రెడ్డి సారథ్యంలోని ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో షీలానగర్ లోని వికాస్ కాలేజీలో ఏర్పాటు చేసిన 300 పడకల ఆక్సిజన్ సదుపాయం గల కోవిడ్ కేర్ సెంటర్ ప్రారంభించిన రెండవ రోజుకే 110 మందికి పైగా కోవిడ్ భాదితులకు ఆక్షిజన్ అందించి ఊరట కల్పిస్తుంది. మిగతా కోవిడ్ కేర్ సెంటర్లకు భిన్నంగా కార్పోరేట్ ఆసుపత్రులకు ధీటుగా మల్టీ టైర్ ఆక్సిజన్ సరఫరా విధానంతో పేషెంట్లకు ఆక్సిజన్ సరఫరాలో పూర్తి భద్రత కల్పిస్తుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్లో పౌష్టికాహారం అందించి వారి ఆరోగ్యం త్వరిత గతిన కోలుకునే విధంగా చర్యలు చేపడుతున్నారు. చికిత్స పొందుతున్న కోవిడ్ భాదితుల యోగ క్షేమాలు రిసెప్షన్ వద్ద నుండే తెలుసుకునే విధంగా సిసి కెమెరాలు,కంప్యూటర్లు మెదలగు ఏర్పాట్లపై భాదితుల సహాయకులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శనివారం ఉదయం నుండి ఆదివారం సాయంత్రం నాటికి మెత్తం 111 మంది బాదితులు కోవిడ్ కేర్ సెంటర్లో చేరగా అందులో 75 పురుషులు, మిగిలిన 36 మంది స్త్రీలు ఉన్నారు. మెదటి రోజు 66 మంది భాదితులు చేరగా రెండవ రోజు సాయంత్రం 6 గంటల వరకు 45 మంది భాదితులు చేరారు. డాక్టర్ల సూచనలు మేరకు ఆదివారం సాయంత్రం నాటికి మెత్తం 16 మంది కోవిడ్ రోగులను మెరుగైన చికిత్స కోసం విమ్స్ ఆసుపత్రికి తరలించారు. అంబులెన్స్ లో ఆక్సిజన్ సదుపాయం కల్సిస్తూ వైద్య సిబ్బంది పర్యవేక్షణతో రోగులను విమ్స్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో 9 మంది పురుషులు కాగా మిగిలిన 7 మంది స్త్రీలు. శనివారం ఇద్దరికి మాత్రమే విమ్స్ ఆసుపత్రికి తరలించగా మిగిలిన 14 మందిని ఆదివారం డాక్టర్ల సూచనల మేరకు తరలించారు.