గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు సేవలు మరింతగా అందేలా చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఇన్చార్జి డిపిఓగా నియమితులైన తూతిక విశ్వనాధ శ్రీనివాస్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ పోల బాస్కర్ ఉత్తర్వుల మేరకు ఆయన ఇన్చార్జి డిపీఓగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత డిపిఓ నారాయణరెడ్డి కోవిడ్ భారిన పడటంతో ఆ బాధ్యతలను ఈయనకి అప్పగించారు. ఇటీవలే ఎస్సీకార్పోరేషన్ ఈడిగా శ్రీనివాస్ విధుల్లోకి చేరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం గ్రామస్థాయిలోనే ప్రజలకు సేవలందించడానికి గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటైందని..దాని ద్వారా పూర్తిస్థాయిలో సేవలందితే ప్రజలు జిల్లాకార్యాలయాల వరకూ వచ్చే పరిస్థితి ఉండదన్నారు. సచివాలయాల్లో అందే అన్నిసేవలపైనా ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. అనంతరం కార్యాల సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి ఇన్చార్జి డీపీఓకి శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా విధినిర్వహణలో ముక్కుసూటిగా వ్యవహరించే ఈయనను జిల్లాకలెక్టర్ గర్తించి డిపీఓ బాధ్యతలు అప్పగించడం విశేషం.