ఆసుపత్రుల్లో జర్మన్ హాంగర్స్ ఏర్పాటు చేయాలి..


Ens Balu
4
Collector Office
2021-05-17 12:52:57

ఆసుపత్రులలో అదనంగా కోవిడ్ పేషెంట్లకు వైద్య సేవలు అందించడానికి గాను ప్రభుత్వ ఆసుపత్రులైన కె.జి.హెచ్., విమ్స్, ఛాతీ ఆసుపత్రులలో  జర్మన్ హాంగర్స్ ను సత్వరమే ఏర్పాటు గావించాలని  ఎస్.ఇ. ఆర్.ఎండ్.బి సుధాకర్ ను జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ ఆదేశించారు. సోమావారం ఈ విషయము పై కలెక్టరు, వైద్యాధికారులు, ఎస్.ఇ. ఆర్.ఎండ్.బి.అధికారులతో కలెక్టరు సమావేశము నిర్వహించారు. ఈ విషయముపై ఎస్.ఇ.,ఆర్.ఎండ్.బి.సుధాకర్ మాట్లాడుతూ ఇందుకు గాను ఇప్పటికే  ఇ.టెండర్లు ఆహ్వనించడమైనదని, 20వ తేదీన  బెడ్స్ తెరచి పనులకు ఉత్తర్వులు మంజూరు గావించడం జరుగుతుందని  వివరించారు. కెజిహెచ్ లో 100 పడకలు, విమ్స్ లో 100 పడకలు,  ఛాతీ ఆసుపత్రిలో 50 పడకలకు ఏర్పాట్లు గావించాలని కలెక్టరు సూచించారు.  పనులు మొదలు పెట్టిన తదుపరి ఒక రోజులో ఏర్పాట్లు పూర్తి గావించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టరు-2,పి.అరుణ్ బాబు, ఎ.ఎమ్.సి. ప్రిన్సిపాల్ డా.సుధాకర్, డి.ఎం .హెచ్.ఒ.డా.సూర్యనారాయణ, ఎస్.ఇ. ఆర్.ఎండ్.బి సుధాకర్ , ఇ.ఇ. ఎస్.ఇ. ఆర్.ఎండ్.బి ప్రశాంత్ పాల్గొన్నారు.
సిఫార్సు