ఎంప్యానెల్డ్ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ క్రింద క్యాష్ లెస్ ట్రీట్ మెంట్లు నిబంధనల ప్రకారం జరగాలని జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో కోవిడ్ సేవలకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ పడకలు కేటాయింపు పై సోమవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేటగిరి ‘ ఎ ’ మరియు కేటగిరి ‘ బి ‘ ఎంప్యానెల్ ఆసుపత్రులలో ఆ మేరకు పడకలు ఖచ్చితముగా కేటాయింపు జంగాలన్నారు. పడకల వివరాలను ఖచ్చితముగా ఆసుపత్రుల నోడల్ అధికారులు, ఆసుపత్రుల యాజమాన్యాలు డిఆర్డిఎ ప్రాజెక్టు డైరక్టరుకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని పేర్కొన్నారు. I C U, వెంటిలేటర్ పడకలు, ఆక్సిజన్ పడకలు మొదలగు కేటగిరీల వారీగా పడకలు ఆరోగ్య శ్రీ క్రింద కేటాయింపు గావించి తెలియజేయాలని ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారము ఆరోగ్య శ్రీ క్రింద క్యాష్ లెస్ ట్రీట్ మెంట్ జరగాలి, కాని పేషెంట్లు సెల్ఫ్ ఫైనాన్స్ తో ట్రీట్మెంట్ పొందుట జరుగుతోందని, ఇది సరికాదన్నారు. ప్రభుత్వ ఉత్తరువులు జి.ఒ.నెం.210 ప్రకారము ఆరోగ్యశ్రీ క్రింద పడకలు కేటాయింపును అమలు చేయాలని స్పష్టం చేశారు.
నిబంధనల ప్రకారము ఆరోగ్యశ్రీ బెడ్స్ కేటాయింపు చేయాలని, నిబంధనలు పాటించని ప్రవేటు ఆసుపత్రులకు నోటీసులు ఎందుకు జారీ చేయలేదని. (డి.ఎమ్.హెచ్.ఒ., ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ లను ప్రశ్నించారు. విశాఖపట్నంలో ఆసుపత్రులు, అధికంగా వున్నాయని, అయినా 104లో టిక్కెట్లు పెండింగు వుండటం శోచనీయమని పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ అరుణ్ బాబు ప్రైవేటు ఆసుపత్రులు, ఆరోగ్య శ్రీ బెడ్స్ కేటాయింపు విషయముపై పనిచేయాలన్నారు. ఆర్.డి.ఒ. విశాఖపట్నం పెంచల కిషోర్ ప్రైవేటు ఆసుపత్రులను రెవెన్యూ యంత్రాంగముతో తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. జిల్లా కలెక్టరు అనుమతి తేకుండా ప్రైవేటు ఆసుపత్రులు కోవడ్ ట్రీట్ మెంటు ఇవ్వరాదని వెల్లడించారు. ప్రైవేటు ఆసుపత్రుల పైన పూర్తిగా దృష్టి సారించాలని ఎ.డి. సర్వే మనీషా త్రిపాఠిని ఆదేశించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో పడకలకు సంబంధించిన వివరాలను ఒక ప్రొఫార్మాలో తక్షణమే అందజేయాలని ఆరోగ్యశ్రీ కోఆర్డినేటరు రాజేష్ ను ఆదేశించారు. నోటిఫై కాబడిన ప్రైవేటు ఆసుపత్రులు అన్నీ ఆరోగ్యశ్రీ క్రింద బెడ్స్ కేటాయించి కోవిడ్ సేవలు ఖచ్చితముగా అందించాలన్నారు. ఆసుపత్రుల నోడల్ అధికారులు ఆసుపత్రుల్లో ఉండి ఆరోగ్యశ్రీ పడకలు, కేటాయింపు పై దృష్టి సారించి వివరాలు తెలపాలని స్పష్టం చేశారు. డిఎమ్ హెచ్ ఒ ప్రతిరోజు ఉదయం 5 ఆసుపత్రులు, మధ్యాహ్నం 5 ఆసుపత్రులను తనిఖీలు చేసి నివేదికలను ఎప్పటికప్పుడు అందించాలని ఆదేశించారు. కోవిడ్ పాజిటివ్ రిపోర్టు లేదని అడ్మిషన్ నిరాకరించరాదని, కేటగిరి బి ఆసుపత్రుల ఎంప్యానెల్మెంటు (పర్మనెంటు / తాత్కాలికము) పూర్తి గావించాలని డి.ఎం .హెచ్.ఒ.ను ఆదేశించారు.
ఆసుపత్రులలో పడకల వివరాలు, కేటాయింపు విషయముపై ఒక సాఫ్టవేర్ ఎన్.ఐ.సి. అధికారిచే తయారు చేయించాలని, పడకల పొజిషన్ నిర్దిష్టంగా ఎప్పటికప్పుడు సాఫ్టవేర్ /యాప్ ద్వారా తెలపాలన్నారు.
డి.ఎమ్.హెచ్.ఒ., ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటరు ప్రైవేటు ఆసుపత్రులు, బెడ్స్ కేటాయింపు విషయముపై సీరియస్ గా పనిచేయాలని ఆదేశించారు. డి.ఎం..హెచ్.ఒ. తే 18.5.2021 దిన కేటగిరి ఎ ఆసుపత్రులతో వెబినార్ నిర్వహించాలని, పి.డి. డి.ఆర్.డి.ఎ. వద్ద పెండింగులో వున్న 240 బెడ్స్ ఒక్కరోజులో పూర్తి కావాలన్నారు. వెంటిలేటర్స్ పై ఆడిట్ నిరహించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్-2 పి. అరుణ్ బాబు, ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డా. పి.వి. సుధాకర్, డిఎంహెచ్ ఒ సూర్యనారాయణ, ట్రైనీ కలెక్టర్ అతిథి సింగ్, ఆర్డిఓ పెంచల కిషోర్, సర్వే శాఖ ఎడి మనీషా త్రిపాఠి, ఆరోగ్య శ్రీ కో ఆర్డినేటర్ రాజేష్,సిపిఒ శ్రీనివాస్, డా. మురళీ మోహన్, తదితరులు పాల్గొన్నారు.