డా.పురుషోత్తంకు కెజిహెచ్ వైద్యుల ఘన నివాళి...


Ens Balu
3
King George Hospital
2020-08-27 20:17:40

విశాఖలో కరోనాతో పోరాడుతూ మ్రుతిచెందిన డాక్టర్ బి.పురుషోత్తం (56) నకు ఆంధ్ర వైద్య కళాశాల, కింగ్ జార్జి ఆసుపత్రి వైద్యులు ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ పురుషోత్తం నైపుణ్యం కలిగిన వారని, నిబద్ధతతో పనిచేసే వారని, వృత్తినే దైవంగా భావించి వైద్యవృత్తిలో నిరంతరం శ్రమించే వారిని వక్తలు కొనియాడారు. 22 సంవత్సరములు అకుంఠిత దీక్షతో  వైద్య కళాశాల, కెజిహెచ్ లో  వైద్య సేవలు అందించారన్నారు.  వైద్య కళాశాల ఆచార్యులుగా చిరస్మరణీయమైన సేవలు అందించాలని,  సహచర వైద్యులు, వైద్య విద్యార్థుల ఆదరాభిమానాలను చూరగొన్నారని ప్రశంసించారు. ప్రతిభావంతుడు, ఉత్తమ గురువు, ప్రజ్ఞ వంతుడైన వైద్యుడు అయిన పురుషోత్తమం హటాత్ మరణం వైద్య కుటుంబానికి తీరని లోటని నివాళులర్పించారు.  ఈ కార్యక్రమంలో ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి వి సుధాకర్ నేతృత్వంలో వైద్య కళాశాల కేజీహెచ్ ఆసుపత్రి వైద్యులు కొవ్వొతులను వెలిగించి నివాళులు అర్పించారు.