మాతృ మరణాలు జరిగితే ఉపేక్షించను..


Ens Balu
1
Paderu
2021-05-17 13:46:57

పాడేరు ఐటిడిఏ పరిధిలోని ఏజెన్సీ గ్రామాల్లో కరోనాతో గర్భవతులు మృతి చేందితే ఉపేక్షించనని సమీకృత గిరిజనాభివృధ్ది సంస్ధ ప్రాజెక్టు అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ సలిజామల సిడిపి ఓలను  హెచ్చరించారు. సోమవారం వైద్యాధికారులు, ఎంపిడిలోలు ,తాహశీల్దార్లు, సహాయ గిరిజన సంక్షేమాధికారులు సిడిపి ఓలతో కోవిడ్ సేవలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ, అంగన్వాడీలను సూపర్‌వైజర్లు పర్యవేక్షణ లోపిస్తోందన్నారు. అంగన్వాడీ సరుకులు పక్కదారి పడితే సంబంధిత సిబ్బంది, సూపర్‌వైజర్‌లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గర్భవతులను పరిరక్షించాల్సిన బాధ్యత అంగన్వాడీలపైనే ఉందన్నారు. అనకాపల్లి , కె జి హెచ్‌లలో గర్భవతులకు ప్రత్యేక కోవిడ్ వార్డులు ఏర్పాటు చేసారని చెప్పారు. గర్భవతులకు పోజిటివ్ వస్తే వైద్యాధికారులు వెంటనే రిఫర్ చేయాలని సూచించారు.  ఏజెన్సీలో సుమారు ఐదు వందల పడకలతో మూడు కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేసామని అన్నారు. కోవిడ్ కేర్ సెంటర్లకు సంబంధిత మండలానికి చెందిన సహాయ గిరిజన సంక్షేమాధికారులను నోడల్ అధికారులుగా నియమించామని చెప్పారు. సమస్యలుంటే ఎటిడబ్యూ ఓలను సంప్రదించాలన్నారు. అరకు కోవిడ్ కేర్ సెంటర్‌కు సంబంధించి ఎటిడబ్యూ ఓ మల్లిఖార్జున రావు 94415 86116, 86392 82540, పాడేరు కోవిడ్ కేర్ సెంటర్‌కు ఎటిడబ్ల్యూ ఓ ఎల్. రజని8309 34 6709, చింతపల్లికి ఎటిడబ్యూ ఓ చంద్ర శేఖర్ 94933 99494 మొబైల్ నంబర్లలో సంప్రదించాలన్నారు. కొత్తాగా ఎన్నికైన పంచాయతీ సర్పంచులతో పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి, పి ఆర్ కమీషనర్ ఈనెల 19వ తేదీన జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తారని దానికి అవసరమైన ఏర్పాట్లు ఎంపిడి ఓలు చేయాలన్నారు. మండలంలో మూడుచోట్ల ల్యాప్‌టాప్‌ల ద్వారా జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించాలన్నారు.  ఈ సమావేశంలో గిరిజన సంక్షేమశాఖ ఉపసంచాలకులు జి.విజయకుమార్, అదనపు జిల్లా వైద్యాధికారి డాక్టర్ లీలా ప్రసాద్, జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ డా. కృష్ణారావు, సహాయ గిరిజన సంక్షేమాధికారులు,11 మండలాల వైద్యాధికారులు ,రెవెన్యూ అధికారులు, ఎంపిడి ఓలు తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు