ఫీవర్ సర్వేచేయని వలంటీర్లను తొలగించండి..


Ens Balu
2
Ulavapadu
2021-05-17 15:24:15

గ్రామ స్థాయిలో వాలంటీర్లు చేపట్టిన కోవిడ్ సర్వే వివరాలను కంప్యూటర్లో అప్‌లోడ్ చేయని వారిని విధుల నుంచి తొలగించడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్  పోల భాస్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉలవపాడు మండలం పెదపట్టపుపాలెం గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖి చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామంలో కరోనా వైరస్ కట్టడికి అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. పెదపట్టపుపాలెం గ్రామంలో 1,304 గృహాలు వున్నాయని, గృహాలు వారిగా కోవిడ్ పరీక్షలు నిర్వహించాలన్నారు.
గ్రామంలో ప్రజలందరికి కోవిడ్ పరీక్షలు నిర్వహించి కోవిడ్ లక్షణాలు వున్నవారిని ప్రభుత్వ ఆసుపత్రులకు పంపాలన్నారు. కోవిడ్ లక్షణాలు వున్నవారిని హోం ఐసోలేషన్‌లో వుండే విధంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నోటీసులు జారీచేయాలని ఆయన చెప్పారు. గ్రామాల్లో మండల
స్థాయి అధికారులు కోవిడ్ వ్యాప్తి గురించి తరచుగా తనిఖీలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉలవపాడు ఎమ్.పి.డి.ఓ. టి . రవి కుమార్, తహసిల్దార్ సంజీవ రావు, మెడికల్ ఆఫీసర్ రాజ్యలక్ష్మి, సచివాలయ సిబ్బంది , తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు