కోరోనా కట్టడికి ప్రభుత్వం సత్వర చర్యలు..


Ens Balu
2
Markapuram
2021-05-17 15:27:33

రాష్ట్రంలో కోవిడ్ కట్టడికి ప్రభుత్వం పెద్దఎత్తున చర్యలు తీసుకోవడం జరిగిందని రాష్ట్ర  విద్యాశాఖ మంత్రి ఆది మూలపు సురేష్ వెల్లడించారు. సోమవారం స్థానిక మార్కాపురం జిల్లా వైద్య శాలలో 60 పడకల కోవిడ్ కేర్ సెంటర్ ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి  ఆది మూలపు సురేష్ ,జిల్లా కలెక్టర్  పోల భాస్కర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ మార్కాపురం డివిజన్ కేంద్రంలోని జిల్లా వైద్యశాలలో అన్ని రకాల వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. మార్కాపురం జిల్లా వైద్య శాలలో ప్రస్తుతం70 ఆక్సిజన్ బెడ్స్ మరియు50 నాన్ ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయన్నారు. మార్కాపురం జిల్లా వైద్య శాలలో1.70 కోట్ల రూపాయలతో  ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. త్వరలో మార్కాపురం జిల్లా వైధశాలను పూర్తి స్థాయిలో ఆక్సిజన్ బెడ్స్ హాస్పిటల్ గా తీర్చిదిద్దుతామని మంత్రి చెప్పారు. భవిష్యత్తు లో జిల్లా హాస్పిటల్ కు ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.కోవిడ్ నియంత్రణకు ప్రజలందరూ మాస్క్ లు ధరించి సామాజిక దూరంగా పాటించాలన్నారు.ఒంగోలు పార్లమెంట్ సభ్యులు  మాగుంట శ్రీనివాస రెడ్డి సహకారంతో జిల్లా వైదశాలలో 60 బెడ్స్ కోవిడ్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన చెప్పారు. ఈ అవకాశాన్నీ పేద ప్రజలు వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్  పోల భాస్కర్ మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ మొదటి దశ కంటే రెండవ దశ వేగంగా వ్యాప్తి చెందుతుoదన్నారు.జిల్లాలో కోవిడ్ కట్టడికి టాస్క్ ఫోర్స్ కమిటీ ని నియమించడము జరిగిందన్నారు.జిల్లాలో గ్రామ స్థాయిలో ప్రజలకు  కోవిడ్ పరీక్షలు నిర్వహించడానికి  ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.కోవిడ్ పాజిటివ్ ఉన్నవారికి ప్రభుత్వ హాస్పిటల్స్ కు పంపడం జరుగుతుందన్నారు. కోవిడ్ లక్షణాలు ఉన్నవారిని హోమ్ ఐసోలేషన్ లో ఉండే విధంగా నోటీసులు ఇవ్వాడము జరుగుతుందన్నారు.మార్కాపురం జిల్లా వైద్య శాలలో ఆక్సిజన్ కొరత లేకుండా1.7 కోట్ల రూపాయలతో ఆక్సీజన్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో జిల్లా వైద్య శాలలో ఆక్సిజన్ కొరత ఉండదని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం ఎమ్మెల్యే  కుందురు నాగార్జున రెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే  అన్నా రాంబాబు, వైద్య విధాన పరిషత్ జిల్లా కో ఆర్డినెటర్ ఉషా, మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం.శేషి రెడ్డి, మార్కాపురం జిల్లా వైద్య శాల నోడల్ ఆఫీసర్ సరళ వందనం,మున్సిపల్ కమిషనర్ నహీమ్ అహమ్మద్, తహసీల్దార్ విద్యాసాగరుడు,ఎంపీడీఓ హనుమంతరావు, తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు