దాతలూ కరోనాలో మీ సహాయం చాలా అవసరం..


Ens Balu
3
PRAKASAM DISTRICT
2021-05-17 15:30:43

కరోనా వైరస్ రెండవ దశ వేగంగా వ్యాపిస్తున్న నేపధ్యంలో కరోనా బాధితులకు ప్రతి ఒక్కరూ తమ చేత నైన సహాయం చేయడానికి ముందుకు రావాలని జిల్లా క లెక్టర్  పోల భాస్కర్ ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక జిల్లా కలెక్టరేట్ వద్ద కరోనా వైరస్ బాధితులకు మాగుంట రాఘవరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆక్సిజన్ గ్యాస్ సిలెండర్లను జిల్లా కలెక్టరుకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ మొదటి దశ కంటే రెండవ దశ వేగంగా విస్తరిస్తుందని ఆయన చెప్పారు. జిల్లాలో కోవిడ్ రోగులకు ప్రభుత్వ,
పై#్రవేట్ హాస్పిటల్ ద్వారా ఆక్సిజన్ కొరత లేకుండా నిరంతరం సరఫరా చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఆక్సిజన్ నిల్వలపై జిల్లా స్థాయిలో జిల్లా సంయుక్త కలెక్టరును, పరిశ్రమల శాఖ జి.ఎమ్.ను, వైద్య ఆరోగ్య శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌ను కమిటీగా పర్యవేక్షించడానికి నియమించడం జరిగిందన్నారు. ఈ కమిటి ప్రతిరోజు గంటల వారిగా ఏయే ఆసుపత్రులకు ఎంతమేర ఆక్సిజన్ వెళ్తుంది అనే విషయాలను పరిశీలిస్తుందని ఆయన
తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రవేటు ఆసుపత్రులకు ప్రతిరోజు 30 టన్నుల మేర ఆక్సిజన్ సరఫరా చేయాల్సి వుండగా ప్రస్తుత ం 24 వేల టన్నులు ప్రతిరోజు సరఫరా జరుగుతుందని ఆయన తెలియజేశారు. జిల్లాలో రోగులకు ఇబ ్బంది లేకుండా ఆక్సిజన్ సరఫరా చేస్తున్నామన్నారు. మాగుంట రాఘవరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రోగులకు ఆక్సిజన్ అందించడానికి 108 ఆక్సిజన్ సిలిండర్లను ఇవ్వడానికి ముందుకు వచ్చిన ట్రస్ట్ వారిని జిల్లా కలెక్టర్ అభినందించారు. అలాగే ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో100 పడకల కోవిడ్ కేర్ సెంటర్‌ను రాష్ట్ర విద్యుత్, అటవీ, శాస్త్ర సాంకేతిక, పర్యావరణ శాఖల మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి రూ. 50 లక్షలతో ఏర్పాటు చేశారన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆక్సిజన్ గ్యాస్
సిలిండర్ల వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డి.ఎమ్.హెచ్.ఓ. డాక్టర్ రత్నావళి, డి.సి.హెచ్.ఎస్. డాక్టర్ ఉషారాణి, మాగుంట చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు