కోవిడ్ నియంత్రణలో అన్నిశాఖలూ భాగస్వామ్యం కావాలి..
Ens Balu
3
Vizianagaram
2021-05-18 09:47:42
కోవిడ్ కట్డడికి క్షేత్రస్థాయిలో ప్రస్తుతం పనిచేస్తున్న బృందాలకు, అదనంగా ఇతర శాఖల సిబ్బందిని కేటాయించి, నియంత్రణా చర్యలను విస్తృతం చేయాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదేశించారు. దీనికోసం వివిధ ప్రభుత్వ విభాగాలతో తన ఛాంబర్‌లో మంగళవారం సమావేశాన్ని నిర్వహించారు. మండలాల వారీగా క్షేత్రస్థాయి సిబ్బంది జాబితాలను రూపొందించి, ఆయా వైద్య బృందాలకు మ్యాపింగ్ చేయాలని సూచించారు. వెంటనే వీరంతా పనులను ప్రారంభించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. బుధవారం నాటికి జాబితాలు సిద్దం చేసి, మ్యాపింగ్‌ను పూర్తి చేస్తే, వారు క్షేత్రస్థాయిలో చేయాల్సిన విధులపై జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని జెసి అన్నారు. సమావేశంలో జెడ్‌పి సిఇఓ టి.వెంకటేశ్వర్రావు, మున్సిపల్ కమిషనర్ ఎస్ఎస్ వర్మ, ఐసిడిఎస్ పిడి ఎం.రాజేశ్వరి, డిఆర్‌డిఏ, డ్వామా, సమగ్ర శిక్ష, విద్యాశాఖ, పంచాయితీ తదితర శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.