ధాన్యం సేకరణలో ఎలాంటి ఇబ్బందులు రాకూడదు..
Ens Balu
1
Kakinada
2021-05-18 09:56:42
ధాన్యం సేకరణలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కంట్రోల్ రూమ్ ద్వారా సమాచారం సేకరించి తక్షణం స్పందించే విధంగా పని చేస్తునట్లు జాయింట్ కలెక్టర్ డా. జి.లక్ష్మిశ పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా పౌరసరఫరాల విభాగంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కంట్రోల్ కేంద్రాన్ని పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ ఇ.లక్ష్మీరెడ్డి, డిఎస్ఓ ప్రసాదరావులతో కలిసి జాయింట్ కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా జేసి కంట్రోల్ రూమ్ ఏర్పాట్లను పరిశీలించి, క్షేత్రస్ధాయి నుండి వచ్చే ఫోన్ కాల్స్ ఏ విధంగా స్పందిస్తున్నారో పరిశీలించారు. క్షేత్ర స్ధాయిలో ఏ రైతు ఆయినా ధాన్యం కొనుగోలు చేయలేది ఫిర్యాదు చేస్తే తక్షణం ఆ ప్రాంత రైస్ మిల్లర్లతో మాట్లాడి ధాన్యం కొనుగోలు చేసే విధంగా కంట్రోల్ రూమ్ అధికారులు పని చేయాలన్నారు. క్షేత్ర స్ధాయిలో ఉన్న విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ కు కంట్రోల్ రూమ్ కు వచ్చిన సమాచారం తెలియజేసి రైతులకు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టాలని కంట్రోల్ రూమ్ పర్యవేక్షణ అధికారులకు జేసి లక్ష్మిశ పలు సూచనలు చేశారు.