కోవాక్సిన్ రెండో డోసు పంపిణీకి ఏర్పాట్లు..


Ens Balu
1
Kakinada
2021-05-18 09:59:20

కోవాక్సీన్ రెండో డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రణాళికాబధ్ధంగా అందించే విధంగా అన్ని ఏర్పాట్లు చేసినట్టు కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్,  కాకినాడ నగర పాలక  సంస్ధ పరధిలోని పైండా సత్తిరాజు నగర పాలక సంస్ధ బాలికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కోవిడ్ వేక్సీనేషన్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జనాభారీత్యా ఎక్కవ సాంద్రత కల్గిన తూర్పు గోదావరి జిల్లాలో కోవిడ్ వ్యాక్సిన్ గ్రామీణ, పట్టణ ప్రాంతాల వారికి సజావుగా అందించే విధంగా జిల్లా యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేసిందన్నారు. ఇందులో భాగంగా కోవిడ్ వ్యాక్సీన్ వేసేందుకు ప్రత్యేక కేంద్రాలు గుర్తించడం జరిగిందన్నారు. ఈ కేంద్రాల్లో ప్రతి మంగళవారం, శుక్రవారాలలో వ్యాక్సీన్ వేస్తారన్నారు. మొదటి  డోస్ వ్యాక్సీన్ వేయించుకున్న వారికి వారు వేయించుకొన్న తేదీలకు అనుగుణంగా వాలంటీర్లు వారి ఇంటికి వెళ్ళి కూపన్లు ఆందజేస్తారన్నారు. కూపన్లు పొందిన వారు గుర్తించిన వ్యాక్సీన్ కేంద్రానికి చేరుకొని వ్యాక్సీన్ పొందాలన్నారు. మొదటి డోసు వేసుకొన్నవారు రెండవ డోస్ కోసం తగిన రశీదు చూపిస్తే రెండవ డోసు కు అవకాశం వుంటుందన్నారు. మొదటి డోసు వేసుకొని తగిన ఆధారాలు లేకపోతే తనకు రెండవ డోస్ కావాలని కోరితే అలాంటి వారికి వ్యాక్సిన్ వేసి రెండవ డోసుగా గుర్తించే విధంగా వ్యాక్సీనేషన్ కేంద్రాలకు సూచనలు చేయడం జరిగిందన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ లో మొదటి డోస్ వేయించుకొన్న వారికి రెండవ డోస్ వేయడం జరుగుతుందన్నారు. మే 31 వరకు ప్రతి మంగళ, శుక్రవారాల్లో రెండో డోస్ వేయడం జరుగుతుందనీ, జూన్ నెల నుండి మొదటి డోస్ వేయడం జరుగుతుందని కలెక్టర్ వెల్లడించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పైండా సత్తిరాజు బాలికోన్న పాఠశాలలో ఏర్పాటు చేసిన వ్యాక్సీన్ కేంద్రంల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను నగర పాలక సంస్ధ అధికారులతో కలిసి పరిశీలించారు.
సిఫార్సు