కోవిడ్ బాధితులకు యోగాలో శిక్షణ..


Ens Balu
2
Srikakulam
2021-05-18 10:02:57

శ్రీకాకుళం జిల్లాలో కోవిడ్ బాధితులకు యోగ, వ్యాయామాలు ఆస్పత్రుల్లో ప్రవేశపెడుతున్నారు. జిల్లా కోవిడ్ ఆసుపత్రి జెమ్స్ లో యోగ ఇప్పటికే ప్రవేశపెట్టి కోవిడ్ బాధితులకు సాధారణ వ్యాయామాలను బోధిస్తున్నారు. వ్యాయామ, యోగా నిపుణులతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు ఆసుపత్రి సూపరింటిండెంట్ డాక్టర్ హేమంత్ మంగళవారం తెలిపారు. ఆసుపత్రిలో ఫిజియోథెరాఫీతో పాటు యోగ, వ్యాయామ శిక్షణ ఏర్పాటు చేస్తున్నామని తద్వారా కోవిడ్ బాధితుల్లో మానసిక ధైర్యం ఏర్పడుతుందని అన్నారు. యోగాలో సాధారణ ఆసనాలు, ప్రాణాయామాలు చేయడం ద్వారా వారిలో శ్వాస కోస వ్యాయామాలు చేయించడం జరుగుతుందని తద్వారా మంచి మార్పు వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఫిజియోథెరాఫీ, యోగాతో త్వరగా కోలుకుంటున్నారని హేమంత్ పేర్కొన్నారు. కోవిడ్ బాధితులు త్వరగా కొలుకుని ఇంటికి చేరాలని ఆయన ఆకాంక్షించారు. ఇందుకు ఆత్మవిశ్వాసం, ధైర్యం అవసరమని అటువంటి వారు త్వరగా కొలుకుంటున్నారని అందుకు యోగా సహాయ పడగలదని ఆయన వివరించారు.
సిఫార్సు