జాగ్రత్తలు పాటించకపోతే తిష్ట వేస్తుంది..


Ens Balu
4
Machilipatnam
2021-05-18 12:34:32

కరోనా సమయంలో జాగ్రత్తలు పాటించకపోతే  వైరస్ ఊపిరితీత్తుల్లో తిష్ట వేస్తుందని రాష్ట్ర రవాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్నారు.  మొదట్లో వైరస్ సోకిన 3,  5 రోజుల్లో లక్షణాలు కనిపించేవనీ, ఇప్పుడు అనేక కేసులలో ముదిరిన తర్వాతే కనిపిస్తున్నాయిని హెచ్చరించారు.  మంగళవారం  తన కార్యాలయంకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. మచిలీపట్నంకు చెందిన ఎం ఎస్ ప్రకాశరావు మంత్రి వద్ద తన సమస్యను చెప్పుకొన్నారు. తమ బంధువు ఒకరు కరోన సోకి ఆ సమస్యతో బాధపడుతున్నారని దీంతో ఆక్సిజన్ స్థాయి క్రమేపి తగ్గిపోతుందని ప్రభుత్వాసుపత్రిలో ఒక ఆక్సిజన్ బెడ్ ఇప్పించాలని కోరారు. ఈ విషయమై స్పందించిన మంత్రి , ప్రకాశరావు గారి  బంధువు పేరు వివరాలు ఫోన్ నెంబర్  వెంటనే తీసుకోవాలని తన వ్యక్తిగత కార్యదర్శి రఘురాంకు సూచించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, కోవిడ్-19 వైరస్ మానవ ఊపిరితీత్తుల్లోకి వెళ్లి..తన సామ్రాజ్యాన్ని నానాటికి  విస్తరించుకుంటుందన్నారు. తర్వాత అది ఊపిరితీత్తులు ఆక్సిజన్ గ్రహించే శక్తిని అడ్డుకుంటుందన్నారు. ఆక్సిజన్ ఉత్పత్తిని అడ్డుకోవడమే కాకుండా.. ఊపిరితీత్తులకు రక్తాన్ని అందించే నాళాలను గడ్డకట్టిస్తుందన్నారు. ఫలితంగా శరీరంలోని ఇతర భాగాలకు ఆక్సిజన్ సరఫరా కాదని దీంతో సమస్య తీవ్రమై రోగిని న్యుమోనియా వైపుకు దారి తీస్తుందని తెలిపారు. ఫలితంగా రక్తంలోనూ ఆక్సిజన్ శాతం తగ్గుతుందని అన్నారు. ఆక్సిమీటర్ ద్వారా ఈ మార్పును గుర్తించవచ్చని వివరించారు. ఆ క్లిష్ట పరిస్థితుల్లో, బాధితుడు తిరిగి తనంతట తానే ఊపిరి పీల్చుకొనే వరకు ఆక్సిజన్ అవసరమవుతుంది. కాబట్టి కరోనా వ్యాధి వచ్చినవారు శరీరంలో ఆక్సిజన్ శాతం మీద నిఘా పెట్టాలని అది ఎప్పుడు తగ్గుతున్నట్లు అనిపిస్తే తక్షణమే వారు వెంటనే వైద్యులను సంప్రదించాలని మంత్రి పేర్ని నాని సూచించారు. .
       అలాగే , కరోనా టెస్టుల్లో నెగటివ్ వచ్చినవారు తమలో వైరస్ లేదని భావించి తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం లేదని ఫలితంగా వైరస్ నెమ్మదిగా ఊపిరితీత్తుల్లో విస్తరించి అకస్మాత్తుగా దాడి చేస్తోందని అన్నారు. సాధారణంగా మానవులు సరైన నిమిషానికి 7 లేదా 8 లీటర్ల గాలిని పీల్చి వదులుతారని  అంటే రోజుకు సుమారు 11 వేల లీటర్ల గాలిని శ్వాసిస్తారని ఇలా పీల్చేగాలిలో కేవలం 20 శాతం మాత్రమే ఆక్సిజన్ ఉంటుంది. ఇందులో ఊపిరితీత్తులు నిమిషానికి కేవలం 5 లేదా 6 మిల్లీ లీటర్ల ఆక్సిజన్ మాత్రమే దేహానికి  ఉపయోగించుకుంతుందని చెప్పారు. ఒక వేళ ఊపిరితీత్తులు పాడైతే..సాధారణం కంటే నాలుగు రెట్లు ఎక్కువ ఆక్సిజన్ గ్రహిస్తాయిని మంత్రి పేర్ని నాని చెప్పారు.  
    ఆక్సిజన్ శాతం 94 నుంచి 90 మధ్యన చూపిస్తుంటే శరీరానికి అదనంగా ఆక్సిజన్ అవసరమని, ఆ సమయంలో శరీరానికి ఎంత ఆక్సిజన్ అవసరమనేది కేవలం వైద్యులకు మాత్రమే తెలుస్తుందని కాబట్టి ఆస్పత్రిలో వైద్యుల సమక్షంలోనే ఆక్సిజన్ తీసుకోవాలని,లేకపోతే వైద్యపరంగా కొత్త సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని మంత్రి అన్నారు. 
  స్థానిక చింతగుంట పాలెంకు చెందిన మాజీ కౌన్సిలర్ మిరియాల బాపనయ్య మంత్రిని కలిసి శారదానగర్, శివగంగ , ఖాలేఖాన్ పేట ప్రాంతంలో పారిశుధ్య పనులు సరిగా జరగడం లేదని చెప్పారు. ఈ విషయమై స్పందించిన మంత్రి మంత్రి పేర్ని నాని మునిసిపల్ కమీషనర్ కు ఫోన్ చేసి మాట్లాడి  ఈ సమస్యపై దృష్టి కేంద్రీకరించి ఆ ప్రాంతాలలో శానిటేషన్  మెరుగుపరచాలని ఆదేశించారు. 
   తాను ఏకాకినని, తనను చూసేవారు ఎవరూ లేరని వృద్ధాశ్రమంలో చేర్పించాలని మచిలీపట్నంకు చెందిన చల్లా బేబీ మంత్రిని ప్రాధేయపడింది. స్పందించిన ఆయన, అమ్మ మిమ్ములను అక్కడ చేర్పిస్తా.. అయితే, మీకు ముందు అనాధ సర్టిఫికేట్ , కోవిడ్ (ఆర్ టి పి సి ఆర్) పరీక్షలు చేయించిన తర్వాత వృద్ధాశ్రమంలో తప్పకుండ చేరవచ్చని అవి నేను మీకు చేయిస్తా అని మంత్రి పేర్ని నాని చెప్పారు.   
సిఫార్సు