సీజనల్ వ్యాధుల్లో ప్రజలకు ఇబ్బంది రాకూడదు..కమిషనర్


Ens Balu
3
Visakhapatnam
2020-08-27 20:49:12

విశాఖ మహా నగరంలో సీజనల్ వ్యాధులు పెరిగే అవకాశం వున్నందున, వ్యాధుల నియంత్రణకు, నివారణకు కావలసిన చర్యలు, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కమిషనర్ డా.జి.స్రిజన అధికారులకు ఆదేశించారు. గురువారం ఈ మేరకు అధికారులు, వార్డు కార్యదర్శదర్శిలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,  ప్రతి సోమవారం వార్డు సెక్రటరీలతో టెలీకాన్ఫరెన్స్ జరుపుతానన్నారు.   కోవిడ్ సోకినవారి ఇళ్ల వద్ద తప్పనిసరిగా సోడియమ్ హైపో క్లోరైట్ ద్రావకం చల్లించే ఏర్పాట్లు చేయాలని సి.ఎం.ఓ.హెచ్.ఓ  డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రిని కమీషనర్ ఆదేశించారు. అదనపు కమిషనర్ డా. వి. సన్యాసి రావు, స్వచ్ఛ సర్వేక్షన్ - 2021 పవర్ పాయింట్ లో వివరించిన అంశాలను అధికారులు,  శానిటరీ సూపర్వైజర్లు,  ఇన్స్ పెక్టర్లు తప్పకుండా ఆ విధులను పాటిస్తూ, నగర పరిశుభ్రతకు, పర్యావరణ సమతుల్యతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఈ  కార్యక్రమంలో, అదనపు కమిషనర్ డా. వి. సన్యాసి రావు, ప్రధాన వైద్యాధికారి   డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, జోనల్ కమిషనర్లు, సహాయ వైద్యాధికారులు, బయోలజిస్టు, శానిటరీ సూపెర్వైజర్లు, శానిటరీ ఇన్స్ పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.