చేపలవేట ప్రధాన జీవనోపాధిగా వున్న మత్స్యకారులకు ప్రభుత్వం అన్ని విధాల అండగా వుంటుం దని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి చెప్పారు. వై.ఎస్.ఆర్. మత్స్యకార భరోసా పథకం కింద అర్హుల బ్యాంకు ఖాతాల్లో వరుసగా మూడవ ఏడాది రూ. 10 వేల చొప్పున నగదు జమచేస్తున్న సందర్భంగా మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడి యో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేపల వేట నిషేధం వల న ప్రభావితమయ్యే ప్రతి మత్స్యకార కుటుంబానికి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ ఆర్థిక సహాయం చేస్తున్నట్లు చెప్పారు. కరోనా వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నా సాధారణ ప్రజల పరిస్థితిని దృష్టిలో
పెట్టుకొని మాట ఇచ్చిన మేరకు సకాలంలో వారికి ఆర్థిక సహాయం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. మరోవైపు మత్స్యకారుల జీవనోపాధి పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ దిశగా ఎనిమిది జిల్లాల్లో ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటుచేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నంలో నిర్మించబోయే హార్బర్ కు ఈ ఏడాదే టెండర్లు పిలిచేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అనంతరం జిల్లానుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర విద్యుత్, అటవీ, శాస్త్ర సాంకేతిక, పర్యావరణ శాఖల మంత్రివర్యులు బాలినేని శ్రీనివాస రెడ్డి మత్స్యకారులను ఉద్థేశించి వ ూట్లాడుతూ కొత్తపట్నంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణం కోసం భూమి సిద్ధంగా వుందని చెప్పారు. ఈ హార్బర్ అందుబాటులోకి వస్తే మత్స్యకారుల జీవనోపాధి మరింత మెరుగు పడుతుందన్నారు. తమ కోసం ఒక భవనం కావాలని మత్స్యకారులు కోరారని, ఈ దిశగా కూడా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ భవనం కోసం 16 సెంట్లు భూమిని వారం రోజుల్లోనే సమకూర్చి పెడతామని కలెక్టరు చెప్పినట్లు బాలినేని ప్రకటించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆది మూలపు సురేష్ మాట్లాడుతూ పేద లు, చేతివృత్తులపై ఆధారపడ్డ
వారి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్థితో పనిచేస్తోందని చెప్పారు. సముద్ర వేట నిషేధ కాల భృతిని గత ప్రభుత్వంలో వున్న రూ. 4 వేల నుంచి 10 వేలకు పెంచడం, మత్స్యకారుల బోట్లకు వాడే డీజిల్‌పై రాయితీని రూ. 6.03 నుంచి రూ. 9 లకు పెంచడం, ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు ఇస్తున్న నష్టపరిహారాన్ని రూ. 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం, ఆక్వా రైతులు వినియోగించే విద్యుత్ ఛార్జీల
యూనిట్ రేటును రూ. 3.86 నుంచి రూ. 1.50 లకు తగ్గించడం, వై.ఎస్.ఆర్. పెన్షన్ కానుక క్రింద మత్సకారుల అర్హత వయస్సును 50 ఏళ్లకు తగ్గించడం, మత్సకారులకు, ఆక్వారైతులకు ప్రభుత్వ సేవలను మరింత చేరువచే సేలా జిల్లాలో 84 మంది గ్రామ మత్స్య సహాయకులను, 65 మంది సాగరమిత్రలను నియమించడం ప్రభుత్వ చిత్తశుద్థికి నిదర్శనమని వివరించారు. జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ మాట్లాడుతూ మత్స్యకార భరోసా కింద జిల్లాలో ప్రస్తుతం 12 వేల 284 మంది రూ. 12.284 కోట్ల మేరకు లబ్దిపొందుతున్నట్లు చెప్పారు. సముద్ర వేట నిషేధకాల భృతి రూ. 36.334
కోట్లు, మత్సకారులకు డీజిల్‌పై సబ్సిడి రూ. 20.40 కోట్లు, ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడి రూ. 210 కోట్లు, వేట చేస్తూ మరణించే మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక సహా యం రూ. 1.20 కోట్లు, రిజర్వాయర్లు, చెరువుల్లో ఉచితముగా చేప పిల్లల విడుదలకు రూ. 30 లక్షలు కలిపి 2019 జూన్ నుంచి ఇప్పటి వరకు జిల్లాలోని మత్సకారులకు మొత్తం రూ. 268.234 కోట్ల ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. అనంతరం మత్స్యకార
భరోసాకు సంబంధి ంచిన నిధుల చెక్కును మంత్రులు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్ , జాయింట్ కలెక్టర్ చేతుల మీదుగా మత్స్యకారులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యురాలు శ్రీమతి పోతుల సునీత, చీరాల శాసన సభ్యులు కరణం బలరామక్రిష్ణమూర్తి, జాయింట్ కలెక్టర్ (ఆర్.బి. అండ్. ఆర్) జె. వెంకట మురళి, పి.డి.సి.సి. బ్యాంకు ఛైర్మన్ మాదాసు వెంకయ్య, మత్స్యశాఖ జె.డి. చంద్రశేఖర రెడ్డి, పశు సంవర్థక శాఖ జె.డి. బేబీరాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.