500 పడకల ఆసుపత్రికి కార్యాచరణ..


Ens Balu
0
Collectorate Complex
2021-05-18 13:23:04

శ్రీకాళహస్తి సమీపంలో ఆక్సిజన్ తో ఐదు వందలు పడకలు గల ఆసుపత్రి ఏర్పాటుకి ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్  అధికారులను ఆదేశించారు.  మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్ లో  వివిధ శాఖల అధికారులతో ఆసుపత్రి నిర్మాణం గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఆక్సిజన్ ప్లాంట్ సమీపంలో ఆసుపత్రి నిర్మాణం చేపడితే బాధితులకు వేగంగా ఆక్సిజన్ ఇవ్వడానికి వీలవుతుందని అదే విధంగా వారు తొందరగా కూడా కోలుకుంటారని అందుకోసం ఆక్సిజన్ కంపెనీ ప్రతినిధులు ఆక్సిజన్ ను ఎంత వేగంగా 500 పడకలకు వీలయ్యే విధంగా ఎన్ని రోజులలో అమర్చ గలరని అందుకోసం ప్రణాళికలను సిద్ధం చేయాలని వారిని కోరారు. అదేవిధంగా ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి జర్మన్ షెడ్ లను ఏర్పాటు చేయాలని ఎన్ని రోజులు ఈ షెడ్యూల్ అను పూర్తి చేయగలరని ఈ ప్రాంగణంలో ఎటువంటి ఏర్పాట్లు ఉండాలని డాక్టర్లు వారి సిబ్బంది ఉండడానికి ఏర్పాట్లు చేయాలని అందుకోసం టాయిలెట్లు తదితర ఏర్పాట్లను నీటి తో సహా ఉండేలా చూడాలని కలెక్టర్ అన్నారు. తాత్కాలికంగా అంతర్గత రోడ్లు ఏర్పాటు చేయాలని మంచి వాతావరణం ఉండేలా చూడాలని ఆయన అన్నారు. బాధితులు ఎవరైతే చికిత్స పొందడానికి రావడం జరుగుతుందో వారికి అన్ని ఏర్పాట్లు ఉండాలని కలెక్టర్ అన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఆసుపత్రి నిర్మాణం చేయాలని భావించిన స్థలాన్ని పరిశీలించడం జరిగిందని అయితే ఏ ఏ శాఖ తరపున ఎంత ఖర్చవుతుందో ప్రణాళికలు రెండు రోజుల్లో సిద్ధం చేస్తామని కలెక్టర్కు వివరించారు. ఈ కార్యక్రమంలో  జాయింట్ కలెక్టర్(అభివృద్ధి) వీరబ్రహ్మం, తిరుపతి ఆర్ డి ఓ కనక నర్సారెడ్డి,జి ఎం డి ఐ సి ప్రతాప రెడ్డి, రోడ్లు భవనాల శాఖ అధికారులు, గ్రామీణ నీటి సరఫరా అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు, మెడికల్ హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు. 
సిఫార్సు