పారిశుధ్యంపై ప్రత్యేక ద్రుష్టి పెట్టాలి..
Ens Balu
1
GVMC office
2021-05-18 14:29:00
మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక ద్రుష్టి సారించాలని కమిషనర్ డా. జి. సృజన అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగలశారం శానిటేషన్ పై అదనపు కమిషనర్ డా. వి. సన్యాసి రావు, ప్రధాన వైద్యాధికారి డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, ఎ.ఎం.ఒ.హెచ్. లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలోని రోడ్లు, కాలువలు శుభ్రంగా ఉండాలని, ఎప్పటికప్పుడు చెత్తను డంపింగు యార్డుకు తరలించాలని ఆదేశించారు. డోర్ టు డోర్ వెళ్లి చెత్తను ఏ విధంగా నిర్వహిస్తున్నది, తడి-పొడి చెత్త సేకరణ అమలు తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. తడి-పొడి చెత్త వేరు వేరుగా ఇవ్వాలని ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని సూచించారు. ఖాళీ ప్రదేశాలలో పిచ్చి మొక్కలు లేకుండా చూడాలని, దుకాణాల వద్ద మూడు చెత్త డబ్బాలు ఉండేలా చూడాలని, అలా లేని దుకాణాలకు అపరాధ రుసుం వసూలు చేయాలని సూచించారు. క్లాప్ (CLAP) పధకం విజయవంతం అయ్యేందుకు సచివాలయాల స్థాయిలో పారిశుధ్య కార్మికులను ఏర్పాటుకు ప్రణాళికా బద్ధంగా నిర్వహించేలా శానిటరి ఇన్స్పెక్టర్లకు, వార్డు శానిటరి కార్యదర్శులకు సూచించాలని ఆదేశించారు. పెద్ద పెద్ద కాలువలలో పూడిక తీత పనులపై కమిషనర్ ఆరా తీసారు. డంపర్ బిన్ల తొలగింపు వంటి కార్యక్రమం, పారిశుధ్య కార్మికులకు పనులు కేటాయింపు చేసి ప్రణాళిక వివరాలను ఎ.ఎం.ఒ.హెచ్. లను అడిగి తెలుసుకున్నారు. పారిశుధ్య నిర్వహణ, స్వచ్ఛ సర్వేక్షన్ ఐ.ఇ.సి. కార్యకలాపాలు మొదలైన పనులను అదనపు కమిషనర్లు అడిగితెలుసుకున్నారు. కరోనా వ్యాప్తి, దాని నివారణ చర్యలపై ప్రధాన వైద్యాధికారిని అడిగి తెలుసుకున్నారు. నగరంలో ప్రతీ వార్డులో రద్దీ ప్రాంతాలలో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని, బ్లీచింగు ను చల్లించాలని అధికారులను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కమిషనర్ డా. వి. సన్యాసి రావు, ప్రధాన వైద్యాధికారి డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, ఎ.ఎం.ఒ.హెచ్. లు తదితరులు పాల్గొన్నారు.