అక్షయ పాత్రలు సేవలు స్లాఘనీయం..


Ens Balu
2
Visakhapatnam
2021-05-18 14:31:40

కరోనా వికృత రూపంతో విలయ తాండవం చేస్తున్న గడ్డు కాలంలో నగరం లోని పేదలు, వలస కూలీల ఆకలి తీర్చెందుకు అక్షయ పాత్ర ఫౌండేషన్ తో జివియంసీ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. నగరం లోని వేలాది మంది అన్నార్తులకు  నిత్యం  ఆహారం అందించే ప్రక్రియను నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, అక్షయ పాత్ర ఫౌండేషన్ ప్రతినిధి యదు దాస ప్రభు మంగళవారం ఆరిలోవలో ప్రారంభించారు. దాతల సహకారంతో అక్షయ పాత్ర చేస్తున్న ఆహార పంపిణీ యజ్ఞానికి జివియంసి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు మేయర్ పేర్కొన్నారు. పనులు లేక, పరిస్థితులు బాగాలేక, ఆస్పత్రుల అవసరార్థం నగరానికి వచ్చి భోజనం కోసం ఇక్కట్లు పడే వారికి ఊరట కల్పించటానికి ఆహార పంపిణీ ఎంత గానో ప్రయోజనంగా వుంటుందని మేయర్ హరి వెంకట కుమారి అన్నారు. సుమారు 5వేల మందికి నగర నలుమూలలకు వెళ్లి భోజనం ప్యాకెట్లు పంపిణీ వేగవంతం చేస్తున్నామని ఆమె తెలిపారు. నగరంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రులైన    కెజిహెచ్, ఛాతీ, ఇయన్ టి, రైల్వే ఆసుపత్రి, జివియంసి నైట్ షెల్టర్లతో పాటు నగరం లోని పేదలు, కూలీలు ఎక్కువగా వుండే ప్రాంతాల్లో  నిత్యం భోజనం ప్యాకెట్లు సరఫరా జరుగుతుందని మేయర్ అన్నారు. అక్షయ పాత్ర సేవలు నగరానికి ఎంతగానో అత్సవసరంగా ఉపయోగపడుతున్నాయి అని మేయర్ ప్రశంసించారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ ప్రతినిధులు ఇంత పెద్ద యెత్తున ఆహార పంపిణీ కార్యక్రమానికి రూప కల్పన చేసిన అక్షయ పాత్ర ఫౌండేషన్ వైజాగ్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీ భక్తదాస్ మరియు సభ్యులుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలకు చాలా ఉపయోగపడుతుందని అలాగే అక్షయ పాత్ర ఫౌండేషన్ వలె మరిన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి పేద ప్రజలకు ఆదుకోవాలని నగర మేయర్ పిలుపునిచ్చారు. జివిఎంసి సంపూర్ణ సహకారంతో నిత్యం 5వేల మందికి ఆహార పొట్లాలు అందిస్తున్నామని ప్రెసిడెంట్ డాక్టర్  భక్తదాస్  అన్నారు.  ఈ కార్యక్రమంలో వైఎస్సార్ పార్టీ సీనియర్ నాయకులు గొలగాని శ్రీనివాస్, అక్షయ పాత్ర ఫౌండేషన్ ప్రతినిధి రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.