నిర్ణీత సమయంలోనే వైద్యసేవలు అందాలి..


Ens Balu
2
Bheemili
2021-05-18 14:38:23

కరోనా సమయంలో ఆసుపత్రిలో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది టైమ్ ప్రకారం విధులు నిర్వహించాలని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం భీమిలీ ఆసుపత్రిలో మంత్రి ఆకస్మికంగా పర్యటించి అక్కడ అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి మాట్లాడుతూ, ప్రజలకు కరోనా కష్ట కాలంలో  మెరుగైన సేవలు అందించాలని, ప్రజలకు అవసరమైన బెడ్ల విషయంలో గానీ, ఆక్సిజన్ విషయంలో గానీ, అంబులెన్స్ విషయంలో గానీ వైద్యులు అందుబాటులో ఉంచాలన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని, భీమిలి ఐఎన్ఎస్ కళింగ లో 60 బెడ్లు, ప్రభుత్వ ఆసుపత్రి లో 10 బెడ్లు, అదేవిధంగా పద్మనాభం మండలంలో 50 బెడ్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.  ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ మాస్కులు  ధరించవలసిందిగా మంత్రి కోరారు. అదేవిధంగా మందులు, సిబ్బంది వివరాలను కూడా మంత్రి వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు.
సిఫార్సు