పింఛనుదారుల సమాచారం తెలియజేయండి..
Ens Balu
1
Collector Office
2021-05-19 13:48:05
కోవిడ్ బారిన ప్రాణాలు కోల్పోయిన పింఛనుదారుల వారసులు, కుటుంబ సభ్యులు సదరు వివరాలను సంబంధిత ఖజానా కార్యాలయంలో సత్వరమే తెలియ వలసినదిగా జిల్లా ట్రజరీ ఉప సంచాలకులు టి.శివరాం ప్రసాద్ ఒక ప్రకటన లో కోరారు. అలాగే పింఛనుబకాయిలు, దహనఖర్చుల కొరకు బ్యాంకు అకౌంట్ తదితర వివరాలు సమర్పించినట్లైతే సంబంధిత ఖాతాల్లో సదరు మొత్తం జమచేయడం జరుగుతుందన్నారు. పింఛనుదారుల వారసులు ఎన్నారైలు అయినట్లైతే పింఛనుదారుల మృతి సమాచారం తెలియక వారికి సంబంధించిన ఖాతాలలోకి పించను సొమ్ము జమయ్యే అవకాశం వున్నందున కుటుంబ సభ్యులు, వారసులు ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం కాకుండా సత్వరమే పింఛనుదారు మరణించిన తేదీని సూచిస్తూ బాధ్యతాయుత పౌరులుగా సంబంధిత ఖజానా కార్యాలయంలో తెలియజేయాలని కోరారు. ఈవిషయాన్ని జిల్లాలో గల ఉప ఖజానా అధికారులకు తగు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.