విశాఖ జిల్లాలో బ్లాక్ ఫంగస్(మ్యూకార్ మైకోసిస్) పేషెంట్లకు చికిత్స నిమిత్తము కె.జి.హెచ్.లోని డెర్మటాలజీ విభాగంలో 20 పడకలు కేటాయించినట్లు జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో క్లినికల్ మేనేజ్ మెంట్ ప్రోటోకాల్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డా. పి.వి. సుధాకర్ నేతృత్వంలో సీనియర్ వైద్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కమిటీలో ప్రభుత్వ ఛాతీ, ENT, ప్రాంతీయ కంటి ఆసుపత్రి సూపరింటెడెంటట్లు, న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డెర్మటాలజి మరియు మైక్రోబయాలజీల విభాగాధిపతులు సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు. ఆసుపత్రులకు వచ్చిన పేషెంట్లను చేర్చుకొని చికిత్స విధి విధానాలను పరిశీలిస్తారన్నారు.