జిజిహెచ్ లో అందుబాటులో సిటి స్కాన్..
Ens Balu
2
Srikakulam
2021-05-19 15:25:47
శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి లో సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ అందుబాటులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. బుధవారం నెల్లూరు, శ్రీకాకుళం, కడప, ఒంగోలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రులలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ మిషన్ లను ముఖ్యమంత్రి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ సిటి స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి లో ఏర్పాటు చేయడం ముదావహం అన్నారు. ఇది జిల్లా ప్రజలకు ప్రభుత్వం కల్పించిన వరంగా అభివర్ణించారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి లో ఏర్పాటు చేయడం వలన ప్రజలకు ఎంతో ప్రయోజనకరమని అన్నారు. ప్రస్తుతం కరోనా పరిస్థితుల రీత్యా సిటీ స్కాన్ అవసరం ఎంతో ఉందని ఆయన పేర్కొంటూ అత్యవసర సమయంలో దీన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఏపీఎస్ఎమ్ఐడిసి నిర్వహణ బాధ్యతలు చూస్తుందని, సంబంధిత కంపెనీ ఏడు సంవత్సరాలపాటు గ్యారంటీ ఇచ్చిందని ఆయన తెలిపారు.