నిరు పేదలకి మెరుగైన వైద్యం..
Ens Balu
1
Srikakulam
2021-05-19 15:28:06
రాష్ట్రంలో పేదవాడికి మెరుగైన వైద్యం అందించడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. బుధవారం శ్రీకాకుళం, కడప , నెల్లూరు, ఒంగోలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రులలో సిటి స్కాన్, ఎన్ఆర్ఐ మెషిన్లను వర్చువల్ విధానంలో ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పేదవాడికి మెరుగైన వైద్యం అందాలని అన్నారు. ఇందు కోసం ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే 11 బోధన ఆసుపత్రులు ఉన్నాయని, మరో 16 బోధనా ఆసుపత్రులను అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన చెప్పారు. ఈ ఆస్పత్రులను ఆరోగ్యశ్రీ పరిధి క్రిందకు తీసుకొని రావడం జరుగుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జె నివాస్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే. శ్రీనివాసులు, సర్వజన ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ కే. కృష్ణమూర్తి, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ.కృష్ణవేణి, సి ఎస్ ఆర్ఎమ్ఓ డాక్టర్ ఆర్ .అరవింద్ తదితరులు పాల్గొన్నారు.