పరిశ్రమల్లో వేక్సినేషన్ కి అనుమతులివ్వండి..
Ens Balu
4
కలెక్టర్ ఆఫీస్
2021-05-19 15:39:31
విశాఖ జిల్లాలోని పరిశ్రమలలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాల ఏర్పాటుకు తగు చర్యలు తీసు కోవాలని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారిణి డా.జీవన్ రాణిని ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరిశ్రమలలో ఆసుపత్రులు వుంటే వాటికి ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్ క్రింద కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్, ఆసుపత్రి లేని పరిశ్రమలలో ఇండస్ట్రియల్ వర్క్ ప్లేస్ వద్ద కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటరు ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలన్నారు. సదరు పరిశ్రమల యాజమాన్యాలు వ్యాక్సిన్ ను మాన్యూఫ్యాక్చరర్స్ నుండి పొందవలసి వుందన్నారు. సదరు కేంద్రాలలో ఆడ్వర్స్ ఈవెంట్ మేనేజ్మెంట్ ఏర్పాట్లు వుండాలన్నారు.