ఆదాయ వనురులపై ద్రుష్టిపెట్టండి..


Ens Balu
3
GVMC office
2021-05-19 15:59:59

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టడానికి ఆదాయ వనరులను పెంపొందించడానికి  దృష్టి చారించాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన సంబంధిత అధికారులను “జూమ్” యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు. బుధవారం ఆమె ఛాంబరు నుండి జివిఎంసి ఉన్నతాధికారులతొను, జోనల్ కమిషనర్లతోను, రెవెన్యూ ఆఫీసర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆస్తి పన్ను, ఖాళీ జాగా పన్ను, కార్పోరేషన్ ఆస్తులు, షాపింగ్ కాంప్లెక్స్లు, మార్కెట్లు మొదలైన్ వాటి నుండి రావలసిన బకాయిలను వెంటనే వసూలుకు కృషి చేయాలని, ఇంకా మదించవలసిన ఆస్తి పన్ను, ఖాళీ జాగా పన్ను, త్వరితగతిన చేపట్టాలన్నారు. యజమనుదారులు తమ ఆస్తులను నివాస యోగ్యము నుండి వాణిజ్య వినియోగానికి మార్చి వినియోగిస్తున్న వాటిపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.  నీటి చార్జీలు పై మరింత దృష్టి సారించాలని బల్క్, సెమి బల్క్ వినియోగదారు నుండి రావలసిన బకాయిలను రాబట్ట్టాలని, అనుమతి లేకుండా గృహాలకు వాడు చున్న కుళాయిలను గుర్తించి వాటిని క్రమబద్దీకరించాలని, గృహ, వాణిజ్య భవనములు, అపార్ట్మెంట్లు మొదలైన వాటిని సర్వే చేసి వాటికి నూతనంగా కొళాయి కనక్షన్లు మంజూరు చేసి చార్జీలు సూలు చేయాలన్నారు. పట్టణ ప్రణాళికా విభాగపు ఆదాయ వనరులు మరింతగా పెంచాలని, మొత్తం పాత భవనములు ఎన్ని ఉన్నాయి, కన్స్ట్రక్షన్ భవనములు ఎన్ని ఉన్నాయి, కొత్త భవనములు ఎన్ని ఉన్నాయి, ఖాళీ జాగాలు ఎన్ని ఉన్నాయో సర్వే చేయాలని ప్రతీ సచివాలయ పరిధిలో వీటిని క్షేత్ర స్థాయి పరిశీలన చేసి వాటి వివరాలను నమోదు చేయాలని, వాటిపై రీ- సర్వే జరపాలని అధికారులను ఆదేశించారు. జూన్ 30వ తేది నాటికి వార్డు ప్లానింగు కార్యదర్శులచే వీటిని సిద్ధం చేయాలని సూచించారు. 
సచివాలయ హాజరు పట్టి సరిగా నిర్వహించడం లేదని వార్డు అడ్మిన్ కార్యదర్శులు ఈ బాధ్యతా తీసుకొని హాజరు వేయాలని, మూమెంట్ రిజిస్టర్, డైరీ విధిగా వ్రాయాలని సూచించారు. వీటిపై జోనల్ కమిషనర్ల పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. కోవిడ్ దృష్ట్యా ప్రతీ సచివాలయంలో ఒక డ్రాప్ బాక్స్ ఏర్పాటు చేసి ఆర్జీలను అందులో వేయించాలన్నారు. ఆర్జీలను వెంటనే పరిష్కరించాలన్నారు. ఇ.ఆర్.పి.లు పెండింగు ఉండకూడదని ఎవ్వరి వద్ద పెండింగు కనిపిస్తున్నాయో వారికి చార్జి మెమో ఇవ్వడం జరుగుతుందని కమిషనర్ హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిందని ప్రజలకు సేవ చేసే అవకాసం మనకు కలిగిందని, ప్రతి ఒక్కరూ, కోవిడ్ నిబంధనలు పాటించి విధులు నిర్వహించాలని సూచించారు.    
 వీడియో కాన్ఫరెన్స్ లో జివిఎంసి అదనపు కమిషనర్ ఆశాజ్యోతి, పర్యవేక్షక ఇంజినీరు(వాటర్ సప్ప్లై) కె.వి.ఎన్.రవి, డి.సి.ఆర్. ఎ.రమేష్ కుమార్, రెవెన్యూ ఆఫీసర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.      
సిఫార్సు