ఫీవర్ సర్వే పక్కాగా నిర్వహించాలి..
Ens Balu
2
28th ward
2021-05-19 16:01:49
మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో ఫీవర్ సర్వే పక్కాగా నిర్వహించాలని కమిషనర్ డా. జి.సృజన అధికారులను ఆదేశించారు. బుధవారం సర్వేను ఆమె స్వయంగా 28వ వార్డులో రాం నగర్ లో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, కోవిడ్-19 నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జివిఎంసి పరిధిలో అన్ని వార్డులలో ఫీవర్ సర్వే జరుగుతుందన్నారు.రు. నాలుగవ జోన్ పరిధిలో 28వ వార్డు నందు జరుగుచున్న ఫీవర్ సర్వేలో పాల్గొన్న కమిషనర్ మాట్లాడుతూ ఈ సర్వే ద్వారా కరోనా లక్షణాలు గల వ్యక్తులను తొందరగా గుర్తించి వారి ఆరోగ్యం కాపాడటంతో పాటు వైరస్ ఇతరులకు సోకకుండా అరికట్టవచ్చునని తెలిపారు. ఆశా వర్కరులు, వాలంటీర్లు, ఎఎన్ఎం లు కలసి ఈ సర్వే లో పాల్గొంటారని, కోవిడ్ లక్షణాలు కల్గిన వ్యక్తిని గుర్తించి మెడికల్ ఆఫీసర్లు సిఫార్సు చేస్తామని, వారు వెంటనే రోగిని పరీక్షించి హోమ్ ఐసోలేషణ్ కిట్స్ ఇస్తారని, వారిని పరిస్థితులను బట్టి హోమ్ ఐసోలేశాన్లో ఉంచాలా లేదా క్వారంటైన్ కు పంపించాలా లేదా ఆసుపత్రికి రిఫర్ చేయాలా నిర్ణయంచడం జరుగుతుందని తెలిపారు. కావున, జివిఎంసి పరిధిలో ఉన్న ప్రజలకు మీ ఇంటికి వచ్చే వాలంటీర్లు, ఆశా వర్కర్లు, ఎఎన్ఎం లకు సహకరించాలని మీ కుటుంబ సభ్యులలో ఎవ్వరికైనా జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, వాంతులు, కడుపు నొప్పి, విరేచనాలు, ఆయాసం, ఊపిరి తీసుకోవడంలో సమస్యలు ఉంటే ఎటువంటి సంకోచం లేకుండా ఫీవర్ సర్వే బృందానికి సహకరించాలని కమిషనర్ ప్రజలకు విజ్ఞప్తి చేసారు. ఈ పర్యటనలో నాలుగవ జోనల్ కమిషనర్ ఫణిరాం, 28వ వార్డు ఇంచార్జ్ పల్లా దుర్గా రావు, శానిటరి ఇన్స్పెక్టరు, వార్డు వాలంటీర్లు, ఆశా వర్కర్లు, ఎఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు.