ప్రజల సహకారంతోనే కరోనా నియంత్రణ..


Ens Balu
2
Vizianagaram
2021-05-20 11:59:44

కోవిడ్ తో పోరాటానికి  కొత్త వ్యూహాలు, పరిష్కారాలు అవసరమని  ప్రధాన మంత్రి  నరేంద్ర మోడీ  పిలుపునిచ్చారు. ప్రస్తుతం కేసు లు తగ్గుతున్నప్పటికి  గ్రామాలను కరోనా రహితంగా ఉంచడం కోసం కోవిడ్ నిర్దిష్ట ప్రవర్తనను అనుసరించేలా అవగాహన కల్పించాలన్నారు.   గురువారం ఉదయం న్యూ ఢిల్లీ నుండి కోవిడ్ కట్టడి చర్యల పై  రాష్త్రాల ముఖ్యమంత్రులు , జిల్లా కలెక్టర్లతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు రాష్ట్రాలకు చెందిన జిల్లా  కలెక్టర్లతో మాట్లాడి కోవిడ్ పరీక్షలు, వాక్సినేషన్, కోవిడ్ కేర్  కేంద్రాల పై  ఆరా తీసారు.  కేసులను తగ్గించడానికి ఆయా జిల్లాల్లో చేపడుతున్న కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుండి తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కు మాట్లాడే  అవకాశం రాగా అక్కడ చేపడుతున్న చర్యల పై ఆయన వివరించారు.  అనంతరం ప్రధాని  మాట్లాడుతూ  కోవిడ్ కట్టడికి నూతన విధానాలను కనిపెట్టి  అమలు చేసేలా చూడాలన్నారు.  స్థానిక పరిస్థితులను దృష్టి లో పెట్టుకొని  అక్కడి సవాళ్ళకు తగ్గట్టుగా కార్యాచరణ చేపట్టాలన్నారు.  ప్రజల నుండి కూడా అభి ప్రాయాన్ని సేకరించి వారి ఆలోచనలను కూడా ఆచరణ లో పెట్టడం ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చన్నారు.  నిరంతరం నూతన పద్ధతులను అన్వేషిస్తూ,  ఎప్పటికప్పుడు  అప్ డేట్ కావాలని,  ప్రజలకు మేలు చేసే కార్యక్రమాల ద్వారా వారిలో విశ్వాసాన్ని నింపాలని అన్నారు.  వాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలనీ, వాక్సిన్ వృధా ను అరికట్టాలని, వాక్సినేషన్ వద్ద గుంపులుగా ఉండకుండా నియమానుసారం జరిగేలా చూడాలన్నారు.
          అంతకు ముందు కేంద్ర కుటుంభ సంక్షేమ శాఖ కార్యదర్శి దేశంలోని కోవిడ్ పరిస్థితుల ను  పవర్ పాయింట్  ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. దేశం లో జరుపుతున్న పరీక్షలు,  పోజిటివిటి  శాతం, మరణాలు, ఆసుపత్రులు, పడకలు, ఆక్సిజన్ నిల్వలు, భవిష్యత్ ప్రణాళికలు తదితర అంశాల పై వివరించారు.  పలు  రాష్ట్రాల్లో కోవిడ్ కట్టడి లో   అమలు చేస్తున్న ఉత్తమ అభ్యాసాలను వివరించారు. దేశం లో పోజిటివిటి  రేట్ 16.9 శాతం గా ఉందని పేర్కొన్నారు.  రెండు డోస్ లలో కలిపి  మొత్తంగా ఇంతవరకు 18.70 కోట్ల మందికి వాక్సినేషన్ పూర్తి చేశామన్నారు. కోవిడ్ నిరోధం పై విస్తృతంగా అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.  24/7 పని చేసేలా ప్రతి జిల్లాలోను కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
గ్రామ స్థాయి లో విశ్లేషించాలి:   జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్  
            వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్ మాట్లాడుతూ గ్రామ, వార్డ్ స్థాయి లో పోజిటివ్ కేసు లను, మరణాలను విశ్లేషించాలని  జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. రమణ కుమారికి సూచించారు.  గ్రామాల వారీగా జాబితాలను సిద్ధం చేయాలనీ, వాటిని సమీక్షించి, భవిష్యత్ ప్రణాళికలను వేయడం జరుగుతుందని అన్నారు.  గ్రామాల్లో అవగాహన కల్పించడానికి  గ్రామ స్థాయి బృందాలను కూడా ఏర్పాటు చేయాలనీ ఆదేశించారు.  వెంటనే డేటా ను తాయారు చేసి సమర్పించాలన్నారు. అందుకు తగ్గట్టుగా కొత్త వ్యూహాలను తాయారు చేస్తామన్నారు.
సిఫార్సు