జర్నలిస్టులకు కోవిడ్ వేక్సినేషన్..


Ens Balu
3
Prakasam
2021-05-20 13:19:42

ఒంగోలు నగరంలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ కోవిడ్ వేక్సినేషన్ చేపట్టాలని జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ సమాచార పౌరసంబధాలశాఖ అధికారులను ఆదేశించారు. మీడియా సంస్థల వారీగా జర్నలిస్టుల వివరాలను సేకరించి ప్రతీ ఒక్కరికీ కోవిడ్ టీకా వేయాలన్నారు. గురువారం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ, ఈ మేరకు 21, 22 తేదీల్లో ఆయా మీడియా సంస్థలు వారి సంస్థలో పనిచేసే జర్నలిస్టుల వివరాలను సమాచారశాఖ కార్యాలయానికి అందించాల్సి వుంటుంది. పాత్రికేయునిపేరు, వయస్సు, హోదా, పనిచేస్తున్న సంస్థ పేరు, మొబైల్ నెంబరు, ఆధార్ కార్డు వివరాలను తెలియజేస్తూ తెలియజేయాలన్నారు. కోవిడ్ టీకా ఎప్పుడు వేసేది సమాచారం అందిస్తామని కలెక్టర్ వివరించారు. కరోనా కేసులు అధికంగా వున్న నేపథ్యంలో జర్నలిస్టులు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లా కలెక్టర్ జర్నలిస్టులకు కోవిడ్ వేక్సినేషన్ కార్యక్రమం చేపట్టడం పట్ల పలువురు జర్నలిస్టులు హర్షం ప్రకటించారు.

సిఫార్సు