కరోనా కట్టడికి వ్యూహాత్మక చర్యలు..


Ens Balu
1
Parvathipuram
2021-05-20 13:33:43

కరోనా కట్టడికి అధికారులు వ్యూహాత్మక చర్యలు చేపట్టి గిరిజన గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఐ.టి.డి. ఎ ప్రాజెక్ట్ అధికారి ఆర్ కూర్మనాథ్ అధికారులను ఆదేశించారు. గురువారం ప్రాజెక్ట్ అధికారి తన ఛాంబర్లో జూమ్ ద్వారా సబ్ కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి,ఉప వైద్య ఆరోగ్య అధికారి, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్, వివిధ ఆసుపత్రుల డాక్టర్స్, కోవిడ్ నియోజక వర్గ , మండల ప్రత్యేక అధికారులు, మండలాల తహసీల్దార్లు, ఎం.పి.డి.ఓ లు, పంచాయతీ అధికారులతో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కోవిడ్ నివారణా నిర్వహణ గిరిజన ప్రాంతాలలో నిర్వహణ, సుచనలపై  జూమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు, అనంతరం ప్రాజెక్ట్ ఆదికారీ కోవిడ్ నియంత్రణకు అలాగే కరోనా పాజిటివ్ వచ్చినవారికి అందజేస్తున్న సేవలు తదితర పనుల నిర్వహణ పై అరా తీశారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ అధికారి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో కరోనా రెండవ వేవ్ ఎక్కువగా ఉన్న దృష్ట్యా గ్రామీణ మరియు సెమీ అర్బన్ కమ్యూనిటీ ద్వారా ప్రజలలో మెరుగైన అవగహన కల్పించాలి, గ్రామీణ ప్రాంతాల్లో కరోనా తీవ్రస్థాయి ఆరికట్టడనికి  అన్ని స్థాయిలలో ప్రాథమిక స్థాయి ఆరోగ్య మౌలిక సదుపాయలని కల్పించి, ఇతర అవసరమైన ఆరోగ్య సేవలను అందించడం అవసరం అన్నారు. అలాగే గ్రామానికి చెందిన ఆశా, గ్రామ వోలెంటిర్ ఇంటింటికీ వెళ్లి ప్రతి ఒక్కరి ఆరోగ్య స్థితిని తెలుసుకోవాలి, కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తించి వేరు చేయాలి. వారికి నిర్వహించిన పరీక్షా ఫలితాలు వచ్చేవరకు ఇతరుల నుండి వేరుగా ఉండేలా చూసుకోవాలి అని వారికి సలహా ఇవ్వాలన్నారు.

గ్రామ స్థాయి కమిటీలు ఏర్పాటు

       గ్రామంలో కరోనా రోజు వారి పరిస్థితి పర్యవేక్షణ కోసం అన్ని సూచనలు అమలు అయ్యే విధంగా సర్పంచ్ ఛైర్మెన్ గా, ఎ. ఎన్. ఎం కన్వీనర్ గా ఆశా, వి.హెచ్. ఎస్.ఎన్.సి, గ్రామ వాలెంటిర్, పి.ఆర్.ఐ సభ్యులు - మెంబర్లు గా కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.   పాజిటివ్ వచ్చిన వారికి హోం ఐ సొలేషన్, క్వారెంటైన్ కేంద్రం లేదా ఆసుపత్రులలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందజేయాలన్నారు.  ప్రధానంగా గిరిజన గ్రామీణ ప్రాంతాలలో ఉన్న యువతకు అవగాహన కల్పించాలన్నారు.  అవగాహన లేకపోతే ప్రాణ నష్టం జరుగుతుందన్నారు.  దీన్ని అడ్డుకట్ట వేయడానికి ఆధికారులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. అలాగే గ్రామాలలో  ఫీవర్ సర్వే వేగవంతం చేయాలని పాజిటివ్ వచ్చిన వారిని హోం ఐసోలేషన్ ఉంచి వారికి కిట్లు అందజేయాలన్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలలో దైర్యం కల్పించే బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందని ప్రోజెక్ట్ అధికారి పేర్కొన్నారు. ప్రస్తుతం రోజుకు వందల సంఖ్యలో కరోనా నుంచి కొల్కొని డిస్చార్జ్ అవుతున్నారని వారిని ఆదర్శంగా చూపించి మిగిలిన వారిలో దైర్యం నింపాలని సూచించారు. అలాగే ఫీల్డులో ఉన్న మెడికల్ ఆఫీసర్లు అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలన్నారు.  పరిస్థితి మెరుగు పడడానికి ప్రతి ఒక్కరు భాద్యతగా విధులు నిర్వహించాలన్నారు. అలాగే ఆన్ని పి.హెచ్.సి, సి.హెచ్.సి, ఆసుపత్రులు, క్వారెంటైన్ కేంద్రాలలో ఆక్సీజన్, మందులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

         ఈ జూమ్ వీడియో కాన్ఫరెన్స్ లో సబ్ కలెక్టర్ విదేహ ఖరె, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి రమణ కుమారి,ఉప వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ రవి కుమార్ రెడ్డి, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ వాగ్దేవి, వివిధ ఆసుపత్రుల డాక్టర్స్, కోవిడ్ నియోజక వర్గ , మండల ప్రత్యేక అధికారులు, మండలాల తహసీల్దార్లు, ఎం.పి.డి. ఓ లు, పంచాయతీ అధికారులు పాల్గొన్నారు.
సిఫార్సు