కరోనాలో దాతల సహాయం మరువరానిది..


Ens Balu
2
కలెక్టరేట్
2021-05-20 15:19:03

కరోనా నేపథ్యంలో ఆక్సిజన్ కాన్షన్ట్రేటర్స్ ఎంతో కీలకమని, ఆక్సిజన్ కాన్షన్ట్రేటర్స్ కరోనా సోకిన వ్యక్తులకు ఎంతగానో ఉపయోగపడతాయని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గురువారం సాయంత్రం కరోనా నేపథ్యంలో 4 ఆక్సిజన్ కాన్షన్ట్రేటర్స్ ను విజయవాడకు చెందిన డార్మెంట్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎండీ రత్నారెడ్డి జిల్లా కలెక్టర్ కు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆక్సిజన్ కాన్షన్ట్రేటర్స్ ను అందజేయడం ఎంతో గొప్ప విషయం అన్నారు. డార్మెంట్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎండిని జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం డార్విన్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎండి రత్నారెడ్డి మాట్లాడుతూ కరోనాలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో అమెరికాలో ఉన్న స్నేహితులు కలిసి చాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా నిధులను సేకరించి ఆక్సిజన్ కాన్షన్ట్రేటర్స్ ను రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు అందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం 4 ఆక్సిజన్ కాన్షన్ట్రేటర్స్ ను జిల్లా కలెక్టర్ కు అందజేశామని, మరో వారం పది రోజుల్లోగా మరికొన్ని అందిస్తామన్నారు. ఒక్కో ఆక్సిజన్ కాన్షన్ట్రేటర్ ఒక లక్ష 5 వేల రూపాయల విలువ చేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో అపెక్స్ ఆక్సిజన్ ప్లాంట్ అల్లాబక్ష, అమెరికా డాక్టర్లు వి.రవికుమార్, ఎన్. మురళీ లు పాల్గొన్నారు.
సిఫార్సు