సెప్టెంబరు 4న దుర్గగుడి ఫ్లైఓవర్ ను ప్రారంభిస్తాం...
Ens Balu
2
Vijayawada
2020-08-28 13:07:59
విజయవాలో సెప్టెంబరు4న దుర్గగుడి ఫ్లై ఓవర్ ను ప్రారంభిస్తామని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్పారు. 4 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ది పనులకు నేటిఉదయం మంత్రి స్వాతి సెంటర్,గాంధీ బొమ్మ సెంటర్ వద్ద శుంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ, తన 5ఏళ్ల పాలనలో టిడిపి నగరాన్ని అభివృద్ది చేయకుండా విజయవాడ ప్రజలను మోసం చేసిందన్నారు. జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత నగర అభివృద్దికి బాటలు పడ్డాయని అన్నారు. గతంలో జలీల్ ఖాన్, బొండా ఉమా, గద్దె రామ్మెహనరావు, ఎం.పి కేశినేని నానిలు ఈ నగరానికి ఒక్క ప్రాజెక్టును కూడా తీసుకురాలేకపోయార్నారు. అలాంటిది ఎం.పి నాని ఇప్పడు దుర్గగుడి ఫ్లై ఓవర్ గురించి మాట్లాడటం హస్యస్పదంగా ఉందన్నారు. కృష్ణా పుష్కరాలనాటికే దుర్గగుడి ఫ్లై ఓవర్ పూర్తి చేస్తామని చెప్పిన ఎం.పి కేశినేని నాని ఇప్పడు ప్రజలకు ఏమి సమాధానం చేబుతారని మంత్రి శ్రీనివాసరావు ప్రశ్నించారు.