చందనం అరగదీసే వారు ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించాలని సింహాలచం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి (సింహాద్రి అప్పన్న)ఆలయ ఈఓ ఎంవీ సూర్యకళ ఆదేశించారు. శుక్రవారం దేవస్థానంలో స్వామివారికి రెండవ విడత సమర్పించ నున్న చందనం అరగదీత కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. ఈసందర్భంగా ఈఓ మాట్లాడుతూ, చందనం అరగదీసేవారంతా ఖచ్చితంగా మాస్కులను ముక్కూ, మూతీ మూసుకున్న తరువాతే చందనం అరగదీయాలన్నారు. అటు స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులను కూడా మాస్కులు పూర్తిగా ధరించి, శానిటైజేషన్ పూర్తి అయిన తరువాతమే లోనికి అనుమతించాలన్నారు. మాస్కులు సక్రమంగా వేసుకోని భక్తులను వెనక్కి పంపాలని ఆమె సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, ఆచార్యులు పాల్గొన్నారు.