నిజమైన వారధులు జర్నలిస్టులే..


Ens Balu
3
Gajuwaka
2021-05-21 08:49:29

ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించేందుకు శ్రమించే నిస్వార్థ సేవకులే జర్నలిస్టులని వైఎస్సార్సీపీ గాజువాక నియోజకవర్గ సమన్వయ కర్త తిప్పల.దేవన్ రెడ్డి, గాజువాక శాంతి భద్రతల విభాగం సర్కిల్ ఇన్స్పెక్టర్ పి.మల్లేశ్వరరావు లు అన్నారు. శుక్రవారం గాజువాక జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో  హైస్కూల్ రోడ్డులో ఏర్పాటు చేసిన మినీ కోవిడ్ కేర్ సెంటర్ ను  ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో జర్నలిస్టుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని గాజువాక జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని అన్నారు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూడకుండా సాటి జర్నలిస్టుల ప్రాణాలను కాపాడేందుకు అసోసియేషన్ ప్రతినిధులు ముందుకు వచ్చి మినీ కోవిడ్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేసి  గాజువాక జర్నలిస్టులు ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గాజువాక జర్నలిస్ట్  అసోసియేషన్ ప్రతినిధులు రాము, పితాని ప్రసాద్ ,కొయిలాడ పరశురాం ,గుప్తా,  మూల గిరిబాబు, కృష్ణ శ్రీ ,బాలు ,సురేష్, వసంత్ , మనోజ్ , దాస్,  రాజు, నాగేశ్వరరావు,  మరియు  స్థానిక వైసిపి నాయకులు దర్మాల.శ్రీనివాస్  తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు