క్షేత్రస్థాయి సిబ్బందికి పిపిఈ కిట్లు..


Ens Balu
3
Srikakulam
2021-05-21 09:36:54

శ్రీకాకుళం జిల్లాలో క్షేత్రస్థాయి కోవిడ్ నమూనాలు సేకరిస్తున్న ఆరోగ్య సిబ్బందికి పిపిఈ  కిట్లను అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. శుక్రవారం అధికారులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో కలెక్టర్ మాట్లాడుతూ నమూనాలు అధికంగా సేకరించాలని ఆదేశించారు.  నమూనాలు సేకరణలో అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. గత 14 రోజుల్లో ఆ వ్యక్తి నమూనాలు సేకరించి ఉండరాదని, కొత్త వారికి మాత్రమే సేకరించాలని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే సేకరించిన నమూనాలు తక్షణం ల్యాబ్ కు పంపించాలని ఆదేశించారు. హోం ఐసోలేషన్ లో ఉన్న వ్యక్తులను సందర్శించి ఆ మేరకు యాప్ లో అప్లోడ్ చేయాలని ఆయన ఆదేశించారు. కోటబొమ్మాలి, రెంటికోట తదితర పీహెచ్సీల పరిధిలో హోమ్ ఐసోలేషన్ వ్యక్తులను సందర్శించనట్లుగా నివేదికలు సూచిస్తున్నాయని ఆయన పేర్కొంటూ వైద్యాధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మెడికల్ కిట్లు వెంటనే అందజేయాలని వాటి వివరాలను సమర్పించాలని ఆయన పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో కోవిడ్ యాజమాన్య కమిటీల ఏర్పాటుపై సర్పంచుల సమావేశాలను నిర్వహించి గ్రామస్థాయిలో చేపట్టాల్సిన నమూనాల సేకరణ, పాజిటివ్ వ్యక్తులు ఉపాధి హామీ పనులకు రాకుండా చూడటం, పాజిటివ్ వ్యక్తుల సమాచారం అందించడం, గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ తదితర కార్యక్రమాలను చేపట్టడంతో పాటు  గ్రామాలను కోవిడ్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దుటకు కృషి చేయాల్సిన అవసరాన్ని తెలియజేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే.శ్రీనివాసులు, రెవిన్యూ డివిజనల్ అధికారులు, జిల్లా అధికారులు, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.

సిఫార్సు