జైలులో ఖైదీలకు కరోనా పరీక్షలు..
Ens Balu
2
Vizianagaram
2021-05-21 10:00:07
విజయనగరంజిల్లాలో కోవిడ్ నియంత్రణకు జిల్లా యంత్రాంగం పటిష్టమైన చర్యలను చేపట్టింది. కరోనా వ్యాప్తిని అడ్డుకోవడం పై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. దీనిలో భాగంగా, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ ఆదేశాల మేరకు, విజయనగరం సబ్ జైలులో శుక్రవారం కోవిడ్ పరీక్షలను నిర్వహించారు. జైలు లో ఉన్న 28 మంది అండర్ ట్రయిల్ ఖైదీలు, 10 మంది జైలు సిబ్బంది నుంచి స్వాబ్స్ తీసి, మిమ్స్ ఆసుపత్రిలోని ల్యాబ్ కి, పరీక్షల కోసం పంపించారు. జైలు సూపరింటెండెంట్ దుర్గారావు, డి.ఎస్.జె.ఓ మధుబాబు పర్యవేక్షణలో, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ బాల మురళీకృష్ణ ఆధ్వర్యంలో, ప్రత్యేక వైద్య బృందం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. జైలులో కూడా ప్రతీఒక్కరు మాస్కులను ధరించాలని, ఇతర కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఈ సందర్భంగా వైద్యులు కోరారు.