కోవిడ్ రోగులకు తక్షణ వైద్య సహాయం..
Ens Balu
5
Punganur
2021-05-21 10:09:08
కోవిడ్ బాధితులకు సకాలంలో వైద్య సేవలు అందించేందుకు కమ్యునిటీ హెల్త్ సెంటర్ ను కోవిడ్ ఆసుపత్రిగా మర్పు చేసినట్టు రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం మంత్రి జిల్లా పర్యటనలో భాగంగా పుంగనూరులో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో ఏర్పాటు చేసిన ట్రయేజ్ సెంటర్ ను మంత్రి, చిత్తూరు పార్లమెంట్ సభ్యులు ఎన్.రెడ్డప్ప, తంబళ్లపల్లి శాసన సభ్యులు పెద్ది రెడ్డి ద్వారకనాధ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ తో కలిసి ప్రారంబించారు. అనంతరం ఆసుపత్రిలో కోవిడ్ బాధితులకు వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన పడకల సామర్ధ్యంను మంత్రి స్వయంగా పరిశీలించారు. వైద్య సేవలు అందించడంలో పూర్తి బాధ్యతాయుతంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్లు (అభివృద్ది, సంక్షేమం) వి.వీరబ్రహ్మం, ఎన్.రాజశేఖర్, మదనపల్లి సబ్ కలెక్టర్ జాహ్నవి, మున్సిపల్ ఛైర్మన్ షేక్ ఆలీమ్ బాషా, డి.ఎం.హెచ్.ఓ డా.పెంచలయ్య, డి.సి.హెచ్.ఎస్.(ఇంచార్జ్) డా.అరుణకుమార్, ఎ.పి.ఎం.ఐ.డి.సి దనంజయరెడ్డి, కమ్యునిటీ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ చిరమల, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.