మరింతగా దాతలు ముందుకి రావాలి..


Ens Balu
3
కలెక్టరేట్
2021-05-21 12:06:02

కరోనా నేపథ్యంలో ఆక్సిజన్ కాన్షన్ట్రేటర్స్ ఎంతో ముఖ్యమైనవని, ఆక్సిజన్ కాన్షన్ట్రేటర్స్ ను అందజేయడం ఎంతో గొప్ప విషయమని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం కరోనా నేపథ్యంలో 10 ఆక్సిజన్ కాన్షన్ట్రేటర్స్ ను హైదరాబాద్ కు చెందిన గ్రీన్ కో ఎనర్జీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ గ్రూప్ మేనేజర్ ప్రభాకర్, జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు, తదితరులు జిల్లా కలెక్టర్ కు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా లాంటి పరిస్థితుల్లో పాజిటివ్ వచ్చిన వ్యక్తుల కోసం ఆక్సిజన్ కాన్షన్ట్రేటర్స్ ను అందజేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. గ్రీన్ కో ఎనర్జీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులను జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.

అనంతరం గ్రీన్ కో ఎనర్జీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ గ్రూప్ జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఒక్కో ఆక్సిజన్ కాన్షన్ట్రేటర్ 1 లక్ష 50 వేల రూపాయల విలువ చేస్తాయన్నారు. కరోనాలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో పాజిటివ్ వచ్చిన వారికి మెరుగైన చికిత్స అందించేందుకు కోసం ఆక్సిజన్ కాన్షన్ట్రేటర్లను అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ కో ఎనర్జీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏయూపి సూర్య మోహన్, సీనియర్ మేనేజర్ బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.

సిఫార్సు